కృష్ణ

సుజనా చౌదరి భూములపై సిబి సిఐడీ ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంచికచర్ల, : కంచికచర్ల, వీరులపాడు మండలాలలో రాజ్యసభ సభ్యుడు, ఆయన బంధువులు కొనుగోలు చేసిన భూములపై సిబి సిఐడీ అధికారులు శుక్రవారం కూడా విచారణ జరిపారు. మూడు రోజులుగా ఈ మండలాల్లోని గ్రామాల్లో భూముల క్రయ, విక్రయాలు, సుజనా చౌదరి బంధువుల కొనుగోలు చేసిన భూముల వివరాలు సేకరిస్తున్నారు. ఇటీవల మంత్రి బొత్సా సత్యనారాయణ రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని, సుజనాచౌదరి తదితర నాయకులు భూములు కొనుగోలు చేశారని ఆరోపించిన విషయం తెలిసిందే. వీటిపై పూర్తి ఆధారాల కోసం సిబి సిఐడీ అధికారులు రైతుల వద్ద నుండి వివరాలు సేకరిస్తున్నారు.

మగ్గం కలిగిన ప్రతి ఒక్క చేనేత కుటుంబానికి ఆర్థిక సాయం
చల్లపల్లి, సెప్టెంబర్ 20: చేనేత కార్మికులకు వైఎస్‌ఆర్ సహాయ పథకం కింద మగ్గం కలిగిన ప్రతి చేనేత కార్మిక కుటుంబాన్ని గుర్తించేందుకు రీ సర్వే చేపట్టాలని చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకుడు ఎస్ రఘునందన్ అన్నారు. శుక్రవారం ఆయన మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ప్రసాద్‌తో కలిసి గ్రామ కార్యదర్శులు, చేనేత సొసైటీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మగ్గం కలిగిన ప్రతి కుటుంబాన్ని గుర్తించాలని, గుర్తింపు కార్డులు లేకున్నా గత కొంత కాలంగా మగ్గం పని చేస్తుంటే వారిని గుర్తించాలన్నారు. చేనేత కుటుంబానికి నెలకు రూ.2వేలు చొప్పున ఏడాదికి రూ.24వేలు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ పథకం డిసెంబర్ నుండి అమలులోకి రానుందని తెలిపారు.