కృష్ణ

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, మండలంలోని ఎవరైనా సరే అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ ఆర్ దుర్గాప్రసాద్ శుక్రవారం తెలిపారు. మండలంలోని ఇసుక క్వారీ పరిసర ప్రాంతాల్లో టీంలు ఏర్పాటు చేశామని, వారు ప్రతిరోజు గస్తి తీరుగుతారని తెలిపారు. తహశీల్దార్ ఆదేశాలతో శుక్రవారం ఉదయం ఆర్‌ఐ, విఆర్‌ఓలు రొయ్యూరు ఇసుక క్వారీ రేవులో నుంచి వస్తున్న 15 ట్రాక్టర్లను పట్టుకుని తహశీల్దార్ కార్యాలయానికి తరలించామని తెలిపారు. అలాగే మండలంలోని పెనమకూరులో ఒక ట్రాక్టర్‌ను పట్టుకున్నామని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తు పట్టుబడితే ట్రాక్టరు యజమానులపై కూడా చర్యలు చేపడతామని తెలిపారు.

గన్నవరంలో 50 కిలోల గంజాయి పట్టివేత్త

గన్నవరం, సెప్టెంబర్ 20: విశాఖపట్నం నుండి బీదర్‌కు ఎపీ 29ఎన్ 9900 కారులో అక్రమంగా తరలిస్తున్న 59 కిలోల గంజాయిని గన్నవరం పోలీసులు కారుతో సహా స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం చెన్నై కోల్‌కోత్తా రహదారిపై గన్నవరం ఆర్టీసీ బస్‌స్టేషన్ సమీపంలో గురువారం రాత్రి గంజాయి రవాణా చేస్తున్న కారును పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల రాకను గమనించి వారు కారును వదిలి పరారయ్యారు. కారులో ఉన్న 50 కిలోల గంజాయిని కారుతో సహా స్వాధీనం చేసుకున్నారు. గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయిస్తే కఠిన చర్యలు

కంచికచర్ల, సెప్టెంబర్ 20: అనుమతులు లేకుండా దీపావళి మందులు నిల్వ చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని నందిగామ డీఎస్‌పీ జివి రమణ మూర్తి హెచ్చరించారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాఎస్‌పి రవీంద్రనాధ్ బాబు ఆదేశాల మేరకు దీపావళి మందుల విక్రయ దారులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కంచికచర్ల పట్టణంలో డోకుపర్తి శేషుకుమార్, కపిలవాయి బాలాజీ శ్రీనువాసు, పమిడిమర్రి రాజా ఎలియాస్ శివలను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఎనిమిదిన్నర లక్షలకు పైగా విలువైన దీపావళి మందులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ సతీష్, ఎస్‌ఐ హరిబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

సమ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - ప్రముఖ సినీ దర్శకుడు ఆర్ నారాయణమూర్తి
పామర్రు, సెప్టెంబర్ 20: మంచి సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో శుక్రవారం ‘మార్కెట్‌లో ప్రజాస్వామ్యం’ అనే అంశం, తాను చిత్రీకరించిన చిత్రాలపై కార్మిక, కర్షక, సేవా సంస్థల ప్రతినిధులతో చర్చించారు. ఎమ్మెల్యే, ఎంపీ సీటు కావాలంటే కోట్ల రూపాయలు ఇచ్చి సీటు పొందిన తర్వాత కోట్లాది రూపాయలు పంపిణీ చేసి ఎన్నిక కావడం ప్రజాస్వామ్యం కాదన్నారు. ప్రజాస్వామ్య విలువలు దిగజారిపోతున్నాయని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాలకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక మాఫియా రంగంలోకి రావటంతో కార్మిక, కర్షక వర్గాలు నష్టపోతున్నాయన్నారు. ప్రకృతి వనరులు ప్రజల సంపదన్నారు. ప్రజాస్వామ్య విలువలు కాపడటానికి, సమాజంలో మార్పు కోసం తాను అనేక సందేశాత్మక చిత్రాలు నిర్మించినట్లు తెలిపారు. మానవతా సేవా సంస్థ చైర్మన్ పిఎంఎస్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు బరిగల భీమేశ్వరరావు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మూడెడ్ల వెంకటేశ్వరరావు, సీఐటీయు నాయకులు గంగాధర్, నారుూ బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు దాలిపర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ప్రోత్సాహాలను రైతులు
సద్వినియోగం చేసుకోవాలి: ఏడీఏ పద్మజ
గుడ్లవల్లేరు, సెప్టెంబర్ 20: ప్రభుత్వం అందించే ప్రోత్సాహాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ ఎడీఎ బి పద్మజ అన్నారు. మండల పరిధిలోని చిత్రం గ్రామంలో విజయవాడ ఆత్మ ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడీఎ మాట్లాడుతూ ప్రతి నిత్యం ఆహారంలో వాడే కందిని ప్రోత్సహించే విదంగా ప్రభుత్వం 100 శాతం సబ్సిడీపై కంది విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కందిసాగు యాజమాన్య పద్ధతులపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఓ అనంత లక్ష్మి, రైతులు పాల్గొన్నారు.

రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు పెడసనగల్లు విద్యార్థినులు ఎంపిక
కూచిపూడి, సెప్టెంబర్ 20: రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు మొవ్వ మండలం పెడసనగల్లు జెడ్పీ ఉన్నత పాఠశాల బాలికలు ఇరువురు ఎంపికైనట్లు పీఇటీ బివి నాగశివ శుక్రవారం తెలిపారు. గురువారం గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వెయిట్ లిప్టింగ్ పోటీల్లో పెడసనగల్లు గ్రామానికి చెందిన ఆర్ ధన దీపిక 49 కిలోల బాలికల విభాగంలో ప్రధమ స్థానాన్ని సాధించింది. అలాగే వెంకట మణిదేవి 60 కిలోల బాలికల విభాగంలో ప్రథమ స్థానాన్ని సాధించింది. వీరు రాష్ట్ర స్థాయిలో జరిగే వెయిట్ లిప్టింగ్ పోటీలకు ఎంపికైనట్లు పీఇటీ తెలిపారు. బంగారు పతకాలు పొందిన ఇద్దరు క్రీడాకారులను శుక్రవారం హెచ్‌ఎం కె శిరీష, సీఆర్‌పీ ఆంజనేయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, అభినందించారు.

పాముకాటుకు గురై గేదె మృతి
అవనిగడ్డ, సెప్టెంబర్ 20: స్థానిక మండల పరిధిలోని రామకోటిపురంలోని కటారి సుబ్బారావుకు చెందిన చూడి గేదె పాము కాటుకు గురై మృతి చెందిన సంఘటన శుక్రవారం తెల్లవారు జామున జరిగింది. గేదెలను మేపేందుకు సుబ్బారావు గురువారం సాయంత్రం పంట కాలువ గట్టుకు తోలుకు వెళ్లాడు. మేత మేస్తుండగా రక్తపింజేరి కరిచింది. ఇది గమనించిన రైతు చికిత్స చేయించేందుకు గేదెను తీసుకువస్తుండగా మోదుమూడి వంతెన వద్దకు రాగానే పడిపోయింది. అనంతరం పశు వైద్యులు, సిబ్బందిచే చికిత్స నిర్వహించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందింది. సంవత్సరంన్నర క్రితం కోడూరు మండలం నరసింహాపురంలో రూ.64వేలకు ఈ గేదెను కొనుగోలు చేశాడు. మరో 10 రోజుల్లో ఈననున్న గేదె చనిపోవటంతో సుబ్బారావు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.

విజృంభిస్తున్న వైరల్ జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి
వీఎంసీ అధికారులకు మంత్రి వెలంపల్లి ఆదేశం
జ్వరాలపై జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌తో కలిసి సమీక్ష
సీఎం ఆరోగ్య కేంద్రాల తీరుపై ఎమ్మెల్యే విష్ణు అసహనం
విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 20: విష జ్వరాలు ప్రబలకుండా నగరంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని, వీఎంసీ ప్రజారోగ్యశాఖాధికారులు అప్రమత్తంగా ఉండి జ్వరాల నియంత్రణకు విస్తృత చర్యలు చేపట్టాలని రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్‌తో కలిసి పారిశుద్ధ్య చర్యలు, దోమల నియంత్రణ, జ్వరాల అదుపు చర్యలపై వీఎంసీ అధికారులతో సమీక్షించిన మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ నగరంలో జ్వరాల నమోదుకు ఎక్కువ అవుతోందన్న విషయాన్ని గుర్తించాలన్న ఆయన పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడమే కాకుండా జ్వరాల వ్యాప్తి, నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించాలన్నారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలు, ఖాళీ స్థలాలలో నిలిచిన నీటి నిల్వలు, అపరిశుభ్రత ల కారణంగా దోమలు వ్యాప్తి చెందుతున్నాయని, నగరంలో డెంగ్యూ జ్వరాల జాడ కనిపిస్తున్నందున వాటిపై మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా హౌసింగ్ బోర్డు కాలనీ పరిసర ప్రాంతాల్లో సమస్య మరింత జటిలంగా ఉందన్నారు. రానున్న దసరా ఉత్సవాలకు పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేయాలని, దూర ప్రాంతాల నుంచి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు నగరంలో ఉన్న వైరల్ జ్వరాల సోకకుండా తగు నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. రోజు వారీ ప్రణాళికలతో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలన్న మంత్రి వెలంపల్లి పారిశుద్ధ్య సిబ్బంది తమ విధుల్లో ఎటువంటి అలక్ష్యం వహించకుండా బాధ్యతతో వ్యవహరించాలన్నారు. కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించాలని వీఎంసీ అధికారులను ఆదేశించారు. నగరంలో ప్రతిరోజు చేపట్టే పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, జ్వరాల నమోదు తదితర అంశాలతో కూడిన నివేదిక అందజేయాలన్న ఆయన సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన చైతన్యం పెంచే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. జిల్లా కేంద్ర హాస్పటల్స్‌తోపాటు పాత ప్రభుత్వ హాస్పటల్‌లో డెంగ్యూ నిర్ధారణ పరీక్ష అయిన ఎలీసా పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఎక్కుగవా జ్వరాలు నమోదైయ్యే నగర పరిధి ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను మరింత ఎక్కువగా చేపట్టాలన్నారు. డివిజన్లలో ఉన్న ఆరోగ్య కేంద్రాలలో ఉన్న సదుపాయాలు, ప్రతి రోజు నమోదవుతున్న జ్వరాల కేసులు, పరీక్షల అనంతరం వచ్చిన పాజిటివ్ కేసుల సంఖ్య తదితర వివరాలతో నివేదిక ఎప్పటికప్పుడు అందించాలని తెలిపారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ జిల్లా జనాభాలో 30శాతం మంది నగరంలోనే ఉన్నారని, ఇందుకు తగిన విధంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలన్నారు. నగరంలో ఉన్న 26 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల పనితీరు అధ్వాన్నంగా ఉందన్న ఎమ్మెల్యే విష్ణు, అక్కడ పనిచేసే ఎఎన్‌ఎం లు క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడంతో వైద్య సేవలు సరిగా అందడం లేదన్నారు. జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధికారులు చేపట్టాల్సిన నివారణ చర్యలు సైతం సకాలంలో చేపట్టకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆయన ఇటువంటి అనైతిక పనులపై ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా చేయవద్దన్నారు. ప్రభుత్వ ప్రధాన హాస్పటల్ తోపాటు నగరంలో మరో ప్రాంతంలో డెంగ్యూ వ్యాధి నిర్ధారణ ఎలీసా పరీక్షలు నిర్వహించేందుకు మరో కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని సూచించారు. రాజీవ్‌నగర్‌లో ఉన్న ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాన్ని మరింత మెరుగుపర్చాలన్న ఆయన సెంట్రల్ నియోజకవర్గం చుట్టూ బుడమేరు తోపాటు మూడు నదీ కాల్వలు, ఎక్కువ ఖాళీ స్థలాలు ఉన్నాయని, వీటి వల్ల దోమల వ్యాప్తి మరింత జాస్తిగా ఉందన్నారు. వాంబేకాలనీ సీఎం ఆరోగ్య కేంద్రం పరిధిలో 108 ఆంబులెన్స్ వాహనాన్ని అందుబాటులో ఉంచాలని విష్ణు తెలిపారు. మలేరియా సిబ్బంది డోర్ టు డోర్ సర్వే నిర్వహించి అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అజిత్‌సింగ్‌నగర్, వాంబేకాలనీ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను విస్తృత పర్చాలన్న ఆయన రానున్న సోమవారం జిల్లాలో వైద్య ఆరోగ్య పరిస్థితులపై ఉమ ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖామంత్రి సమీక్షించనున్నారని అధికారులు సూచించారు. ఈ సమావేశంలో తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మూర్తి, ప్రభుత్వ హాస్పటల్ సూపరిటెండెంట్ నాంచారయ్య, వీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్ యూ శారద, సీఎం ఆరోగ్య కేంద్రాల నిర్వాహకులైన అపోలో ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు.

విష జ్వరాలతో నగరం విలవిల
* డెంగ్యూ లక్షణాలతో సింగ్‌నగర్‌లో వ్యక్తి మృతి
* ఆరోగ్య కేంద్రాల్లో లేని రక్తపరీక్షల కిట్లు
* చోద్యం చూస్తున్న ప్రజాప్రతినిధులు
( ప్రజారోగ్య శాఖ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. డెంగ్యూ ప్రభలకుండా అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం అంటూ బాకాలు ఊదిన అధికారులు చివరికి విగతజీవి దేహాన్ని సందర్శించేందుకు మాత్రమే పరిమితమైనారన్న విషయం స్పష్టం. దీనిని పరిశీలిస్తే దోమలపై దండ యాత్ర అన్న పాలకులు చివరికి అధికారులే ఓడిపోయారని చెప్పకనే చెప్పవచ్చు. అజిత్‌సింగ్‌నగర్ లో గురువారం రాత్రి డెంగ్యూ వ్యాధితో మృతి చెందిన దూపాటి శ్యామ్ మృతి ఈప్రాంతాలలోనే కాక నగరం మొత్తం కలకలం రేపగా, పాలకుల వైఫల్యానికి అద్దం పడుతోంది.)
పాయకాపురం, సెప్టెంబరు 20: అమరావతి నగరం...నిత్యం ఎంతో మంది దిగ్గజాలు పయనించే ప్రాంతం...అయితే పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది ప్రస్తుత విజయవాడ నగర పరిస్థితి. విద్యలవాడ, వైద్య వాడగా పేరొందిన విజయవాడ నగరం ప్రస్తుతం విష జ్వరాలతో అల్లాడుతుంది. ఎక్కడ ఏ ఆసుపత్రిలో చూసినా జ్వరపీడితులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. నగరంలో కురుస్తున్న వర్షాలకు దాదాపు అన్ని ప్రాంతాల రోడ్లు, డ్రైనేజీలు పొంగిపొర్లుతూ అపరిశుభ్ర వాతావరణాన్ని నెలకొల్పుతున్నాయి. దీనికి తోడు దోమల సమస్య నగర వ్యాప్తంగా ఉంది. అయినప్పటికీ కార్పొరేషన్ సిబ్బంది కాల్వల్లో బ్లీచింగ్ వంటివి చల్లడంగానీ, దోమల నివారణకు స్ప్రేలు చేయడంగానీ ఎక్కడా చేయడం లేదు. ఎక్కడి చెత్త అక్కడే కుప్పులు తెప్పలుగా పేరుకుపోవడం, దానికి నీటి కాలుష్యం తోడవ్వడంతో కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఎంతో మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల రక్తాపరీక్షల కోసం వేలల్లో వసూలు చేస్తున్నారు. అలాంటి వారి పై కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బహిరంగంగా ప్రకటించినప్పటికీ ‘ఇలాంటివి మామూలే’ అన్నట్లుగా ప్రైవేటు ల్యాబ్ టెక్నిషియన్లు వ్యవహరిస్తున్నారు. ఇక ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ... ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లోనూ రక్త పరీక్షలు చేసేందుకు తమకు ప్రభుత్వం నుండి కిట్‌లు సరఫరా కాలేదంటూ వైద్యులు చేతులెత్తేస్తున్నారు. దీంతో రోగులు ‘ ఇదేం ప్రభుత్వం’ అంటూ తలలు బాదుకుంటున్నారు. ఇదిలా ఉండగా డెంగ్యూ జ్వర లక్షణాలతో అజిత్‌సింగ్‌నగర్ లూనా సెంటర్‌కు చెందిన దుపటి శ్యామ్ (27) కారు డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. ఈయనకు భార్య సలోమితో పాటు మూడు నెలల బాబు ఉన్నాడు. కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న శ్యామ్‌ను నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. అయితే రక్తంలోని ప్లేట్‌లెట్స్ కౌంట్ పడిపోవడంతో తీవ్రంగా నీరసించి గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఇదిలా ఉండగా విషయం తెలుసుకున్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శ్యామ్ కుటుంబ సభ్యుల్ని శుక్రవారం పరామర్శించారు. అదే విధంగా సిపిఎం రాష్ట్ర నాయకులు చిగురుపాటి బాబూరావు సైతం శ్యామ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి, స్థానికుల నుండి వివరాల్ని సేకరించారు. దోమల సమస్య అధికంగా ఉందని. గత నెల రోజుల నుండి అధికారులకు, వైసిపి నేతలకు చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య చెప్పినప్పుడు నేనున్నాను నే విన్నాను అనే నాయకులు విని ఊరుకుంటున్నారే తప్ప సమస్యను పరిష్కరించడం లేదని స్థానికులు ఎద్దేవా చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు శూన్యం. మరోవైపు ప్రైవేటు ఆసుపత్రుల్లో వేలాది రూపాయలు చెల్లించలేని దయనీయమైన దుస్థితి. మొత్తంగా కలగలసి సగటు సామాన్యుడికి అనారోగ్య పథకాన్ని ‘ఉచితంగా’ అందిస్తున్న ప్రభుత్వం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి మురికివాడలు, పేదలున్న ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాల్ని అందిస్తే కొంతలో కొంతైనా పేదల ఆరోగ్యానికి భరోసా ఉంటుంది.

ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని
రైతులకు అందించండి
* జిల్లా కలెక్టర్
పాయకాపురం, సెప్టెంబరు 20: వ్యవసాయరంగంలో ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని రైతులకు అందిపుచ్చేందుకు రైతులు, వ్యవసాయ శాస్తవ్రేత్తల మధ్య అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ఆత్మ) గవర్నింగ్ బాడి సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ పంటల్లో అధిక దిగుబడి, నూతన వంగడాల రూపకల్పన, ఇతర పంట యజమాన్య పద్దతుల పై ప్రయోగశాలలో నిర్వహించే పరిశోధనలు వివరించేందుకు రైతులు, వ్యవసాయ శాస్తవ్రేత్తల మధ్యన అవగాహన కార్యక్రమాలను మరిన్ని చేపట్టాలని వ్యవసాయ శాఖాధికారులకు సూచించారు. జిల్లాలో 2019-20 ఆర్ధిక సంవత్సరంలో ఆత్మ కార్యక్రమాల నిర్వహణకు రూ.266 కోట్ల రూపాయలతో కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.138 కోట్లు, పశు సంవర్ధక శాఖకు రూ.59 కోట్లు, మత్స్యశాఖకు రూ. 17కోట్లు, ఉద్యానవన శాఖకు రూ.41 కోట్లు, పట్టు పరిశ్రమ శాఖకు రూ.11కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఈ రోజు జరిగిన ఆత్మ గవర్నింగ్ జనరల్‌బాడీ సమావేశంలో వ్యవసాయ, అనుబంధరంగాల ద్వారా విస్తరణా కార్యక్రమాల కార్యాచరణ, బడ్జెట్ కేటాయింపులు, తదితర అంశాల పై విశే్లషణాత్మకంగా చర్చించడం జరిగిందని చెప్పారు. సమావేశంలో కూలంకషంగా జరిగిన చర్చలో ఆయా అంశాల పై శాస్ర్తియంగా వాటిని జిల్లాలో ఏ విధంగా వినియోగిస్తే రైతులకు ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించడం జరిగిందని చెప్పారు. ప్రజలకు సివిల్ సప్లయిస్ శాఖ ద్వారా సన్న బియ్యాన్ని రేషన్‌గా అందించాలని ప్రభుత్వం సంకల్పించిందని, ఇందుకు అనుగుణంగా జిల్లాలో సన్న బియ్యంకు సంబంధించి పంటసాగుకు రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు. ఇందుకు శాస్తవ్రేత్తలు ప్రస్తుతం ఉన్న వివిధ రకాల వంగడాలను తెలియజేయడంతో పాటు సంబంధిత నూతన వంగడాలను రూపొందించి అందించాలని సూచించారు. పొలంబడి శిక్షణా కార్యక్రమాలు మరిన్ని ఎక్కువ చేయాలని కలెక్టర్ సూచించారు. నిర్ధేశించిన లక్ష్యాలకన్నా ఎక్కువగా వీటిని నిర్వహించాలన్నారు. మామిడి పంటసాగులో బుట్టకట్టే విధాన్నా ప్రోత్సహిస్తే మార్కెట్‌లో మంచి ధర లభిస్తుందని అధికారులు చెప్పిన విషయం పై కలెక్టర్ స్పందిస్తూ ఈ కార్యక్రమం పై ఆయా ప్రాంతాల్లో రైతులకు అవగాహన కలిగించే కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహించాలన్నారు. జిల్లాలో ఇప్పటికే డ్రిప్ ద్వారా సాగు చేస్తున్న పంటలకు డ్రిప్ ద్వారానే ఫెట్టికేషన్ కూడా చేస్తే చాలా ప్రయోజనం కలుగుతుందనే విషయం పై కలెక్టర్ స్పందిస్తూ అందుకు తగిన ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. రైతులకు వరి,మినుమ పంట సాగులో సమగ్ర పోషక యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ చర్యల పై పెద్ద ఎత్తున అవగాహన కలిగించాలన్నారు. వరిలో బయో ఫెర్టిలైజర్స్ వినియోగం పై అవగాహన కలిగించాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం కొన్ని క్లష్టర్లలో చేపట్టిన ప్రకృతి వ్యవసాయాన్ని ఇతర ప్రాంతాలలో దానిని చేపట్టేందుకు ఉత్సాహం చూపే రైతులకు ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందించాలని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో చేపలు, రొయ్యల చెరువులకు నీరు విడుదల పై వ్యవసాయం, ఇరిగేషన్, మత్స్య, తదితర శాఖల అధికారులు ప్రాధమిక సమావేశం నిర్వహించాలని ఆయన సూచించారు. అధిక ఆదాయాన్ని సమకూర్చే మత్స్యసాగు కార్యకలాపాలను విస్తరించేందుకు ఆలోచన చేయాలన్నారు. జిల్లాలో కొన్నిచోట్ల సోలార్ పానల్స్ వినియోగంతో సాగు చేస్తున్న రైతులకు సంబంధించి వారు వినియోగించగా మిగిలిన విద్యుత్తు ట్రాన్స్‌కో కొనుగోలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. జిల్లాలో దేశీయ పౌల్ట్రీని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో స్వయం సహాయక గ్రూపుల మహిళలు పాడి పశువులు పెంచుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో పెద్ద సంఖ్యలో రైతు కస్టమరైజ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పంటకోత యంత్రాలు, బైలర్స్ యంత్రాలు రైతులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆత్మ జనరల్ బాడీ తొలి సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్ ఆత్మ పిడి వి.యం.రావు తదితరులు దుశ్శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. సమావేశంలో ఆత్మ పిడి వియం.రావు, వ్యవసాయశాఖ జేడి టి.మోహనరావు, ఆత్మ గవర్నింగ్ బాడి సభ్యులు టి.శివరామ్‌ప్రసాద్, ఎ.శ్రీపద్మ, కొర్రపాటి వీరశింభుడు, మెరుగు మధుబాబు తదితరులు పాల్గొన్నారు.

సమాజాభివృద్ధిలో డ్వాక్రా మహిళల కీలకపాత్ర
* కలెక్టర్ ఎఎండీ ఇంతియాజ్
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 20: సమాజాభివృద్ధిలో డ్వాక్రా మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని కలెక్టర్ ఎఎండీ ఇంతియాజ్ అన్నారు. గొల్లపూడిలో శుక్రవారం జరిగిన జిల్లా సమాఖ్య సర్వసభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలో మహిళా సాధికారతకు కృషి చేస్తున్నామని, బ్యాంకుల ద్వారా రుణాలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో పాటు పోషన్ అభయాన్, పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ వినియోగం నియంత్రణ, పారిశుద్ధ్యం, నేను సైతం కృష్ణమ్మ సేవలో, వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగంపై అవగాహన, ఆయుష్మాన్ భారత్ వంటి సామాజిక కార్యక్రమాల్లో సైతం తమవంతు సహకారాన్ని అందించారన్నారు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన వాటిని సద్వినియోగం చేసుకునేందుకు విద్యావంతులై ఉండాలన్నారు. జిల్లాలో అక్షరాస్యత 76శాతం ఉందని, ఈ శాతాన్ని నూరు శాతానికి పెంచాలన్నారు. స్వయం సహాయక సంఘాల వ్యవస్థ అందుబాటులో ఉన్న గ్రామీణ స్థాయి నుండి అక్షరాస్యతను పెంచి జిల్లాను పూర్తి అక్షరాస్యత జిల్లాగా రూపొందించేందుకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో సెర్ప్ సీఈవో పి రాజబాబు, డీఆర్‌డీఎ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పరిశ్రమలు ఎంత ముఖ్యమో
కార్మికుల హక్కులు అంతే ముఖ్యం
ఎమ్మెల్యే రోజా
పటమట, సెప్టెంబర్ 20: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు ఎంత ముఖ్యమో కార్మికుల హక్కులు ఆయనకు అంతే ముఖ్యమని ఎమ్మెల్యే, ఏపీఐఐసి ఛైర్‌పర్సన్ ఆర్‌కె రోజా అన్నారు. స్థానిక జవహార్ ఆటోనగర్‌లో ఏపిఐఐసీ, ఆటోనగర్ కో అపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ నూతనంగా నిర్మించిన గృహ సముదాయాన్ని ఆమె శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రోజా మాట్లాడుతూ ఆటోనగర్ పాట్ల యాజమానులు, కార్మికుల కోసం ఆధునిక సదుపాయాలతో 485 గృహాల సముదాయాన్ని ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత తొలిసారిగా తన చేతులు మీదుగా ప్రారంభించటం ఆనందంగా ఉందన్నారు. దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి కన్న కలలు ఆయన తనయుడు సీఎం జగన్ సహకారం చేస్తున్నారని తెలిపారు. పరిశ్రమల స్థాపనలో 70 శాతం స్థానికులకే కేటాయించటానికి జగన్ సహసోపైతమైన నిర్ణయం తీసుకున్నారని దీంతో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం జగన్ 100 రోజుల పాలనలో సుమారు 3లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి చరిత్రలో నూతన అధ్యాయాన్ని నెలకొల్పారని అన్నారు. వచ్చే ఉగాది నాటికి పేదలకు 25 లక్షల ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయటానికి సీఎం జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్య పేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ఐలా ఛైర్మన్ సుంకర దుర్గాప్రసాద్, బొప్పన భవకుమార్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో పడకేసిన ప్రజారోగ్యం
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
పటమట, సెప్టెంబర్ 20: రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం పడకేసిందని సీఎం జగన్ 1000 రూపాయల బిల్లు దాటిన వారందరికీ ఉచితంగా ప్రభుత్వం వైద్య సహాయం అందిస్తుందని ఎన్నికలలో హామీ ఇచ్చి ప్రస్తుత ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోవటం లేదని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. శుక్రవారం గుణదల పరిధిలోని మూడవ డివిజన్ గంగిరెద్దుల దిబ్బ ప్రాంతంలో ఆయన పర్యటించి ప్రజల ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ఆనారోగ్యంతో బాధపడుతున్న చింతల రమణ అనే వృద్ధురాలికి వైద్య ఖర్చుల నిమిత్తం 30 వేలు ఆర్ధిక సహాయం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంతో చంద్రబాబునాయుడు ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి సీఎం సహాయ నిధి నుంచి వైద్యానికి వెంటనే నిధులు మంజూరు చేయటం జరిగేదన్నారు. కానీ జగన్ ప్రభుత్వం పేదల వైద్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు . ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షుడు నందిపాటి దేవానంద్, గుళ్ళపల్లి లక్ష్మీప్రసాద్, వడ్లపాటి డేవిడ్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్‌పై దాడులు నిర్వహిస్తున్న వీఎంసీ అధికారులు
200 కేజీల ప్లాస్టిక్ స్వాధీనం
విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 20: నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం ఉన్నందున ప్లాస్టిక్ నియంత్రణ