కృష్ణ

పునరావృతం కాకుండా చూస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రేస్ నర్సింగ్ కళాశాల కరస్పాండెంట్ సమయం రమేష్ ఉదంతంపై అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కేసును నిస్పక్షపాతంగా విచారణ జరిపి నిందితుడికి కఠినమైన శిక్ష పడేలా పోలీసు శాఖ కృషి చేస్తుందన్నారు. ఇటువంటి ఘటనలు జిల్లాలో మరెక్కడా జరగకుండా ప్రత్యేకమైన భద్రతా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే శక్తి టీమ్‌ల ద్వారా మహిళా కళాశాలల్లో వివిధ అంశాలపై కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో కూడా విద్యార్థినుల్లో మరింత మోటివేషన్ కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. గ్రేస్ నర్సింగ్ కళాశాలలో నెలకొన్న పరిస్థితులను కూడా గతంలోనే తమ శక్తి టీమ్ గుర్తించిందన్నారు. విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా బాత్రూమ్‌లు లేకపోవడం, నిబంధనల మేరకు మహిళా వార్డెన్ లేకపోవడం, విద్యార్థినులకు స్వేచ్ఛాకరమైన వాతావరణంలో కళాశాలలో లేకపోవడాన్ని శక్తి టీమ్ గుర్తించిందన్నారు. దీనిపై ఆర్‌పేట సీఐ ఇచ్చిన రిపోర్టు ప్రకారం జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్‌కు రిప్రంజంటేషన్ కూడా చేయడం జరిగిందన్నారు. ఈ లోపే ఈ ఘటన చోటు చేసుకోవడం విచారకరమన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటుందని అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు తెలిపారు.

వెలగలేరులో ఘనంగా గురజాడ జయంతి
జి.కొండూరు, సెప్టెంబర్ 21: వెలగలేరులో ప్రముఖ సంఘసేవకులు, కవి గురజాడ అప్పారావు జయంతిని ఆదర్శ గ్రామీణ సేవాసంస్థ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి చలవాది నాగరాజు, వెలగలేటి పట్ట్భారామయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. సేవాసంస్థ అధ్యక్షకార్యదర్శులు మందాడి శ్రీనివాసరావు, పోలుదాసు రంగనాయకులు మాట్లాడుతూ గురజాడ తన రచనల ద్వారా సాంఘిక పరివర్తన కోసం పోరాడారన్నారు. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సాహితీ కారుల్లో ఒకరన్నారు. ఈనాటికీ ఆయన రచనలు ప్రజల మన్ననలను పొందుతున్నాయన్నారు. జీవభాషలో రచనలు చేశారన్నారు. గిరీశం, మధురవాణి, రామప్పపంతులు అనే నాటకాలు ప్రఖ్యాతి పొందాయన్నారు. సేవాసంస్థ ప్రతినిధులు పోలుదాసు వెంకట్రావు, మాడుగుల సంపత్‌కుమార్, పద్మనాభరావు, తోట శివయ్య, శ్రావణి, హిమశ్రీ పాల్గొన్నారు.