కృష్ణ

బస్టాండ్ నిర్మాణానికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు : తోట్లవల్లూరు గ్రామ ప్రజలు ఇచ్చిన వినతిపత్రంపై ఆర్టీసీ అధికారులు బుధవారం స్పందించారు. ఆర్‌టీసీ ఆర్‌ఎం నాగేంద్రప్రసాద్, సీఈ శివరామరాజు, ఉ య్యూరు ఆర్‌టీసీ డిఎం నాయక్ తదితరులు అధికారులు కలిసి తోట్లవల్లూరులో ఆక్రమణకు గురైన బస్టాండ్ స్థలాన్ని గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. ముందుగా స్థలాన్ని ఆక్రమించిన వారిని ఖాళీ చేయాలని సూచించారు. అలాగే బస్టాండ్ స్థలంలో నిరుపయోగంగా పడి ఉన్న తుప్పుపట్టిన లారీని తొలగించాలని పోలీసులకు విన్నవిస్తామని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యం కోసం వెంటనే బస్టాండ్ నిర్మాణానికి చర్యలు చేపడతామని తెలిపారు. అధికారులతో పాటు స్థానిక గ్రామస్తులు చింతా శ్రీనివాసరావు, ఎండి ఇంతియాజ్‌పాషా, యార్లగడ్డ శివరామకృష్ణ, గనే్న సుబ్రమణ్యం, వివి గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

29 నుండి మోపిదేవి ఆలయంలో దసరా ఉత్సవాలు
బంటుమిల్లి, సెప్టెంబర్ 25: మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఏసీ జివిడిఎన్ లీలా కుమార్ దసరా మహోత్సవ కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. ఈనెల 29వ తేదీ నుండి అక్టోబర్ 8వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 10గంటలకు కుంకుమ పూజలు నిర్వహించటం జరుగుతుందన్నారు. పాల్గొనదలచిన భక్తులు రూ.216 ఒక రోజుకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అక్టోబర్ 7న చండీహోమం నిర్వహిస్తారని, పాల్గొనదలచిన వ్యక్తులు రూ.2,500 చెల్లించి పాల్గొనవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు నౌడూరి విశ్వనాధ సుబ్రహ్మణ్య శర్మ, అర్చకులు ఫణిశర్మ, అధికారులు మల్లేశ్వరరావు, మురళీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పశు సంవర్ధక, మార్కెటింగ్ శాఖల మంత్రి మోపిదేవి వెంకట రమణ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికారు. నాగపుట్ట పూజలు అర్చకులు ఫణికుమార్ శర్మ నిర్వహించారు. ఆలయ పూజలు బుద్ద సతీష్ శర్మ నిర్వహించారు. స్వామివారి చిత్రపటం, తీర్ధప్రసాదములను ఏసీ లీలాకుమార్ మంత్రి మోపిదేవి వెంకట రమణకు అంద చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, చింతా శ్రీనివాసరావు, పార్టీ నాయకులు కె శివాజి, దుర్గారావు, కోసూరు శివనాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.