కృష్ణ

ప్లాస్టిక్ రహితంగా నూజివీడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, :నూజివీడు పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావులు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం స్థానిక పెద్ద గాంధీ బొమ్మ సెంటరు వద్ద ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే విషయంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు వివిధ పాఠశాలల విద్యార్థులతో ఏర్పాటు చేసిన ర్యాలీని సబ్ కలెక్టర్ దినకర్, ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావులు ప్రారంభించారు. పెద్దగాంధీ బొమ్మ నుండి ప్రారంభమైన ర్యాలీ రాజీవ్ సర్కిల్ వరకు కొనసాగింది. ప్లాస్టిక్‌ని వినియోగించవద్దని కోరుతూ విద్యార్థులు పలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని ప్రభుత్వం నిషేధించిందని, ఒక్క సంచి కూడా కనిపించడానికి వీలు లేదని చెప్పారు. ఒకే పర్యాయం వినియోగించి పారవేసే ప్లాస్టిక్ వల్ల తరతరాలకు ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ అవరోధంగా నిలిచిందని అన్నారు. ప్లాస్టిక్ సంచులను వినియోగించవద్దని సూచించారు. ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ వాణిజ్య సంస్థలు కూడా ప్లాస్టిక్ సంచులు ఇవ్వకుండా ఉంటే వినియోగదారులు ఇంటి నుండి సంచులు తెచ్చుకుంటారని చెప్పారు. ప్లాస్టిక్ వినియోగించకుండా వినియోగదారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్లాస్టిక్ వినియోగం వల్ల వచ్చే అనర్థాలు ప్రజలకు వివరించి వారిని చైతన్య వంతులను చేయాలని కోరా రు. కార్యక్రమంలో తహశీల్దారు సురేష్‌కుమార్, ఎంపీడీవో రాణి, సీఐ రామచంద్రరావు, ఎస్‌ఐ శ్రీనివాసరావు, వైకా పా పట్టణ అధ్యక్షులు పగడాల సత్యనారాయణతో పాటు పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.