కృష్ణ

అవనిగ్డలో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ : అవనిగడ్డ మండలంలో బుధవారం గంట పాటు భారీ వర్షం పడటంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారి సైతం నీటితో నిండిపోయింది. అంతర్గత రహదారులు చెరువుల మాదిరిగా దర్శనమిచ్చారు. శ్రీ లంకమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లే రహదారిపైకి వర్షం ఏరు ఏరులై పారింది. ఈ కారణంగా పాదచారులు, ద్విచక్ర వాహనచోదకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో
ఘనంగా ఆయుధ పూజ

మచిలీపట్నం, అక్టోబర్ 9: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీసు సాయుధ దళం ఆధ్వర్యంలో ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. అనంతరం జిల్లా పోలీసు క్వార్టర్స్ వద్ద ఏర్పాటు చేసిన చలువ పందిరిలోని దుర్గా దేవికి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ కె ధర్మేంద్ర, బందరు డీఎస్పీ మొహబూబ్ బాషా, ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, ఎఆర్ డీఎస్పీ సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ సీఐ చంద్రశేఖర్, డీసీఆర్‌బీ సీఐ శ్రీనివాసులు, చిలకలపూడి సీఐ వెంకట నారాయణ, ఆర్‌ఐలు కృష్ణంరాజు, చంద్రశేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.