కృష్ణ

సిలికానాంధ్ర వైద్య సేవలపై విచారణ జరుపుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి : సిలికానాంధ్ర సంజీవని మల్టీ స్పెషాలిటీ వైద్యాలయం నిర్మాణ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటం లేదన్న ఆరోపణలపై బుధవారం పామర్రు శాసనసభ్యుడు కైలే అనిల్‌కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులను సిబ్బంది సేవలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వాహకుడు హరిహరవర్మను ఎమ్మెల్యే పలు విధాలుగా ప్రశ్నించారు. గతంలో గ్రామస్థులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని, 150 గ్రామాలకు వైద్య సదుపాయం ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన నిర్వాహకులు నేటికీ సరైన వైద్యం అందించటం లేదన్న ఆరోపణలు వచ్చాయన్నారు. అలాగే ఆసుపత్రి నిర్మాణానికి దాతలు అందచేసిన విరాళాలు, టీవీ 9 మాజీ సీఇఓ రవి ప్రకాష్ అందచేసిన రూ.4కోట్ల జమా ఖర్చుల వివరాలను అడిగారు. అయితే తమ వద్ద ఆ సమాచారం ఏమీ లేదని కూచిభొట్ల ఆనంద్ ఈనెల 15వ తేదీ తరువాత ఆసుపత్రికి వస్తారని అప్పుడు వారిని ప్రశ్నించాలని సిబ్బంది సూచించారు. అదే సందర్భంగా ఆసుపత్రిపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పకపోతే ప్రభుత్వ అధికారులు ద్వారా విచారణ జరుపుతామని ఆయన హెచ్చరించారు.