కృష్ణ

ఇస్రో పరిశోధనలు భావితరాలకు ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: భారత అంతరిక్ష రంగంలో జరుగుతున్న పరిశోధనలు భావితరాలకు ఆదర్శం కావాలని మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ (కేపీ) అన్నారు. ఇస్రో ఆధ్వర్యంలో స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను బుధవారం కేపీ ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్రో చేస్తున్న పరిశోధనలు, ప్రపంచ దేశాలకు దీటుగా రాకెట్లను, వివిధ రకాలైన లాంచర్లను తయారు చేసి ప్రయోగిస్తున్న తీరును ఆయన ప్రశంసించారు. ఒకప్పుడు అట్టడుగున స్థాయిలో ఉన్న ఇస్రో రానురాను ప్రపంచ దేశాలకు దీటుగా నేడు ఐదోస్థానానికి రావటం హర్షణీయమన్నారు. ఇస్రో చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసి యువ శాస్తవ్రేత్తలుగా వారిని తయారు చేయాలన్నారు. గతంలో ఎటువంటి సౌకర్యాలు, సదుపాయాలు లేకుండానే ఎందరో మహనీయులు శాస్తవ్రేత్తలుగా ఎదిగి భారత కీర్తికిరీటాన్ని ప్రపంచ దేశాలలో నిలబెట్టారని, కానీ నేడు విద్యార్థులకు అన్ని అందుబాటులోకి వచ్చాయని ఇంకా సులభంగా, ఆధునిక సాంకేతిక పరిఙ్ఞనాన్ని అందిపుచ్చుకుని అద్భుతాలు సృష్టించాలని పిలుపునిచ్చారు. ఇస్రో జనరల్ మేనేజర్ పర్వతనేని సునిల్ మాట్లాడుతూ గతంలో కేవలం ఇస్రోలోనే ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించటం జరిగేదని, కానీ గత కొనే్నళ్ళ నుండి ఈకార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించి ఆయా ప్రాంత ప్రజలు, విద్యార్థులలో అవగాహన కల్పిస్తే యువ శాస్తవ్రేత్తలను ఈకార్యక్రమాల ద్వారా తయారు చేయవచ్చని నిర్ణయించి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు మూడు రాష్ట్రాలలో 15 చోట్ల నిర్వహించగా ఆంధ్రలో 11 చోట్ల నిర్వహించినట్లు తెలిపారు. ప్రతియేటా అక్టోబర్ 4నుండి 10వ తేదీ వరకూ ఈకార్యక్రమాలను నిర్వహించటం జరుగుతుందన్నారు. తమ సంస్థలో పనిచేస్తున్న శాస్తవ్రేత్తలు ఇక్కడికి చేరుకుని సందర్శకుల సందేహాలను నివృత్తిచేస్తారన్నారు. కళాశాల ప్రెసిడెంట్ జి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇస్రో ఆధ్వర్యంలో ఇటువంటి బృహత్తర కార్యక్రమాలను నిర్వహణకు తమ కళాశాలను వేదిక చేసుకోవటం తమకు అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కె అప్పారావు, మాజీ ప్రెసిడెంట్ సచిదానందం, ఎంఇఓ రత్నశ్యాం బాబు, ఎరోస్పేస్ విభాగాధిపతి లోవరాజులు ప్రసంగించగా ఇన్‌ఫ్రాడైరెక్టర్ కె తిమ్మారెడ్డి, ఏంసీఏ విభాగాధిపతి అశోక్‌రెడ్డి వేదికపై ఉన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇస్రో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల ప్రదర్శనలను ఆయన తిలకించి వారిని అభినందించారు. మైలవరంతోపాటు వివిధ ప్రాంతాల నుండి విద్యార్థినీ, విద్యార్థులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.