కృష్ణ

ఢీ అంటే ఢీ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : జిల్లా కేంద్రం మచిలీపట్నంలో అధికార, ప్రతిపక్ష సభ్యులు ఢీ అంటే ఢీ అంటూ నిరసనలకు సిద్ధమయ్యారు. శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం జరుగుతున్న వేళ అధికార, ప్రతిపక్షాలు పోరాటాల పోతుగడ్డ అయిన కోనేరుసెంటరులో నిరసన దీక్షలకు పిలుపునివ్వడం బందరు రాజకీయాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. నూతన ఇసుక విధానం పేరుతో కృత్రిమ కొరత సృష్టించి దళారీ వ్యవస్థను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర 36గంటల నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. నిరవధిక దీక్షను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం రవీంద్ర నగరంలోని పలు కార్మిక సంఘాల ప్రతినిధులను కలిసి సంఘీభావం కోరారు. తాను చేపట్టబోయే నిరవధిక దీక్షకు అన్ని వర్గాలు మద్దతుగా నిలిచి ప్రభుత్వానికి నిరసన తెలియచేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఇందుకు ప్రతిగా అధికార పక్షమైన వైఎస్‌ఆర్ సీపీ నేతలు కూడా నిరసనకు దిగనున్నారు. ప్రతిపక్షం తీరును వ్యతిరేకిస్తూ తాము కూడా కోనేరుసెంటరులోనే ఆందోళన చేస్తామని గురువారం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్ దాదా చెప్పారు. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు ఇసుక మాఫియాగా మారి కోట్లు గడించారన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో నూతన ఇసుక పాలసీని ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. అయితే వరదల కారణంగా కొంత మేర ఇసుక సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. దీన్ని బూచిగా చూపించి ప్రతిపక్షం నిరవధిక దీక్షకు దిగడం గర్హనీయమన్నారు. ఇరుపక్షాలు ఒకే సమయంలో ఒకే ప్రాంతంలో నిరసన దీక్షలకు పిలుపునివ్వటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వీరి నిరసన కార్యక్రమాలకు గురువారం రాత్రి వరకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. ఒక పక్క జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారగణమంతా హాజరు కానున్న నేపథ్యంలో కోనేరుసెంటరులో ఇరుపక్షాలు ఆందోళనకు సిద్ధం కావటంతో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు తలెత్తాయి. దీనిలో భాగంగానే పోలీసులు ఇరుపక్షాల నిరసనలకు అనుమతులను నిరాకరించారు. ఇదే విషయాన్ని బందరు డీఎస్పీ మొహబూబ్ బాషా ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉందని, ఇందుకు వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ బాషా హెచ్చరించారు.