కృష్ణ

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణలో సమస్యలు రానివ్వకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణలో ఏ చిన్న సమస్య కూడా రానివ్వవద్దని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వైద్యులకు సూచించారు. ఏ సమస్య వచ్చినా వెంటనే తన దృష్టికి తీసుకు వస్తే పరిష్కార చర్యలు తీసుకుంటానన్నారు. గురువారం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రి పేర్ని నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలు వైద్య విభాగాల వారీగా నెలకొన్న సమస్యలు, అవసరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి త్వరలో మెడికల్ కళాశాల మంజూరు కానుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆస్పత్రిని అన్ని విధాలా అభివృద్ధి పర్చాలన్నారు. 450 పడకల ఆస్పత్రి అయినప్పటికీ అదనంగా 150 పడకలతో వైద్య సేవలు అందిస్తున్నట్లు వైద్యులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. 12 ఎకరాల ఆస్పత్రి విస్తీర్ణంలో ఐదు ఎకరాల్లో మాత్రమే భవనాలు ఉన్నాయన్నారు. ఇందులో నర్సింగ్ కళాశాల నిర్మాణానికి ఎకరం భూమిని కేటాయించామన్నారు. మిగిలిన స్థలం ఖాళీగా ఉందన్నారు. ఆస్పత్రి ఆవరణలో అరకొర వసతులతో కొనసాగుతున్న నర్సింగ్ కళాశాలను సమీపంలో ఉన్న ప్రైవేట్ భవవనంలోకి తరలించేందుకు సమావేశం తీర్మానించింది. రాత్రి వేళల్లో అత్యవసర కేసులు చూసేందుకు వైద్యులను ఆస్పత్రికి రప్పించేందుకు వాహనం సదుపాయం ఏర్పాటు చేయాలని పలువురు వైద్యులు మంత్రి పేర్నిని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణతో ఫోన్‌లో మాట్లాడగా 15 రోజుల్లో వాహనాన్ని అందించేందుకు బాడిగ అంగీకారం తెలిపారు. అనస్తీషియా విభాగంలో చాలా కాలం నుండి వాడుతున్న సర్జికల్ పరికరాల స్థానంలో కొత్తవి కొనుగోలు చేసేందుకు స్వయంగా మంత్రి పేర్ని రూ.5వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఆపరేషన్ థియేటర్‌లో 20 మంది అసిస్టెంట్ల అవసరం ఉందని సూపరింటెండెంట్ డా. జయకుమార్ మంత్రి దృష్టికి తీసుకు వెళ్లగా ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ అవుట్ సోర్సింగ్‌లో తీసుకునేందుకు సమావేశంలో తీర్మానించారు. వివిధ వైద్య విభాగాలలో అవసరమైన ఎనిమిది మంది ల్యాబ్ టెక్నిషియన్లను మెరిట్, రోస్టర్ నిబంధనలను పాటిస్తూ అవుట్ సోర్సింగ్‌లో తీసుకునేందుకు కూడా సమావేశం నిర్ణయించింది. ఎంసీహెచ్ బ్లాక్‌లో ఆరోగ్యశ్రీ ఇన్‌పేషెంట్ల నమోదుకు సిబ్బంది కావాలని, రక్తపరీక్షలకు ల్యాబ్ టెక్నిషియన్లు కావాలని కోరారు. ఆస్పత్రికి అవసరమైన మంచాలు, పరుపులు, దుప్పట్లు ఆరోగ్యశ్రీలో కొనాలని మంత్రి సూచించారు. వివిధ వార్డుల్లో అవసరమైన ఎక్యూప్‌మెంట్, మెటీరియల్ వార్డుల వారీ ఇండెంట్ తీసుకుని వాటి కొనుగోలుకు టెండర్ల ద్వారా కాంట్రాక్ట్‌కు అప్పగించాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో ఖాజావలీ, డీసీహెచ్‌ఎస్ డా. కె జ్యోతిర్మణి, డీఎంఅండ్‌హెచ్‌ఓ డా. శ్రీరామచంద్రమూర్తి, ఆర్‌ఎంఓ విజయ నిర్మల, నగర పాలక సంస్థ కమిషనర్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.