కృష్ణ

మాయమాటలు నమ్మి మోసపోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు) : మారుతున్న కాలానికి అనుగుణంగా మన ఆలోచనా విధానంలో కూడా మార్పు వచ్చినప్పుడే మనం ముందుకు సాగగలమని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సాంకేతిక రంగం కొత్తపుంతలు తొక్కుతున్న వేళ అదే స్థాయిలో మోసాలు కూడా పెచ్చు మీరుతున్నాయన్నారు. యువతీ యువకులు సామాజిక మాధ్యమాల వినియోగంలో ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. సోషల్ మీడియాలో పరిచయాల వల్ల అనేక సంఘటనలు సంభవించి మోసాలు జరుగుతున్నాయన్నారు. స్పందనకు వచ్చ ఫిర్యాదులన్నీ క్షుణ్ణంగా విచారణ జరిపి అవసరం మేరకు కేసులు నమోదు చేసి ఫిర్యాదుదారులకు నిర్ణయించిన సమయంలోపు న్యాయం చేసే విధంగా పోలీసు అధికారులు వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ధర్మేంద్ర, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ విజయరావు, బందరు డీఎస్పీ మోహబూబ్ భాషా, మహిళా పీఎస్ డీఎస్పీ అజీజ్, ట్రాఫిక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎఆర్ డీఎస్పీ సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ సీఐలు చంద్రశేఖర్, రాజారావు, చిలకలపూడి సీఐ వెంకట నారాయణ, ఆర్‌ఐలు చంద్రశేఖర్, వెంకట్రావు, స్పందన ఇన్‌ఛార్జి ఎస్‌ఐ దుర్గాప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

నేడు బుద్ధాలపాలెంలో రైతు భరోసా ప్రారంభం
మచిలీపట్నం (కోనేరుసెంటర్), అక్టోబర్ 14: మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించి వైఎస్‌ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని మండల పరిధిలోని బుద్దాలపాలెం గ్రామంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో జివి సూర్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన రైతులకు భరోసా పత్రాలు అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

సచివాలయ ఉద్యోగులపై బృహత్తర బాధ్యత
* కలెక్టర్ ఇంతియాజ్

మచిలీపట్నం, అక్టోబర్ 14: క్షేత్ర స్థాయి పాలనా వ్యవస్థను మెరుగుపర్చేందుకే సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం బృహత్తరమైన బాధ్యతలను అప్పగించిందన్నారు. ఆ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిక్షణ తరగతులలో బోధించిన అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఇఓ సూర్యప్రకాశరావు, మెప్మా పీడీ జివి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.