కృష్ణ

తాపీ పనివార్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్) : తాపీ పనివార్లు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. సోమవారం ఆయన తన నివాసానికి వచ్చిన ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మచిలీపట్నం బృందావనపుర తాపీ పనివార్ల సంఘం ప్రతినిధులు జన్ను బాబూరావు, రమణారావు, బాకీ వీరబాబు, బడుగు ఆంజనేయులు, సిహెచ్ జయరావు తదితరులు పట్టణంలో తాపీ పని వార్లు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. భవనాలు నిర్మించుకునే యజమానుల ద్వారా ఒక శాతం పన్నును ప్రభుత్వం వసూలు చేయడం ద్వారా కార్మిక సంక్షేమం కోసం ఒక నిధిని ఏర్పాటు చేస్తారని, ఈ నిధి కింద సుమారు రూ.1300కోట్లు ఉన్నాయని మంత్రికి తెలియజేశారు. గత నాలుగు నెలలుగా ఇసుక కొరత వల్ల తాపీ పనివార్లు అర్ధాకలితో అలమటిస్తున్నారని, వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న కార్మిక సంక్షేమ నిధి నుండి కరువు భత్యంగా నాలుగు నెలల భత్యం అందించాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళతానన్నారు.

ఊరి చెత్తతో ఊరి బయట కాలుష్యం
ఉయ్యూరు, అక్టోబర్ 14: ఊరిలోని చెత్తను ఊరి బయటపోసి చేతులు దులుపుకుంటోంది నగర పంచాయతీ. దానివల్ల వందల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. భూగర్భ జలాలు, వాతావరణం కాలుష్యమవుతోంది. దీనిని పంచాయతీ విస్మరించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టణ పరిధిలోని ఎగినపాడు, నాగన్నగూడెం ప్రాంతాలు పూర్తిగా దళిత, వెనకబడిన వర్గాలు నివాసం ఉండే ప్రాంతం. ఈ ప్రాంతానికి చేరుకునే రోడ్డు స్థానిక బైపాస్ రోడ్డు నుండి చీలుతుంది. కేసీపీ చక్కెర కర్మాగారం వెనకభాగాన ఉండే ఈ ప్రాంతం తీవ్ర దుర్గంధంతో, పర్యావరణ కాలుష్యంతో నిండిపోయింది. ఒకప కేసీపీ చక్కెర కర్మాగారం నుండి వెలువడే దుర్గంధానికి తోడు నగర పంచాయతీ పట్టణంలో సేకరించిన చెత్తను ఈ ప్రాంతానికి వెళ్ళే రహదారి వెంట పోయడం, దానిని నిత్యాగ్ని హోత్రంలా అంటించి వెళ్ళిపోవడం, దాని నుండి వచ్చే దుర్వాసనతో ఈ ప్రాంత ప్రజలు అనారోగ్యం పాలవడం అనేక ఏళ్ళుగా జరుగుతోంది. చెత్త నుండి సంపద సృష్టిస్తామని, లక్షలు, కోట్లు వెచ్చించినట్లు లెక్కలు చూపిన ప్రభుత్వాలు, ఈ కంపోస్టుపై ఎందుకు దృష్టి సారించడం లేదని స్థానికులు అంటున్నారు. ఒక ప్రాంత పారిశుద్ధ్యం తమ ప్రాంతానికి శాపంగా మారిందని, బడా బాబులు నివసించే ప్రాంతంలో ఇలా కంపోస్టు పోస్తే ఊరుకుంటారా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి ఈ ప్రాంతంలో పర్యావరణాన్ని కాపాడేందుకు కంపోస్టును వేరే ప్రాంతానికి తరలించి, తమ ఆరోగ్యాలు కాపాడాలని కోరుతున్నారు.