కృష్ణ

రెండు రోజుల్లో ‘అభివృద్ధి’ ప్రణాళికలు సిద్ధం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : ప్రతి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో రూ.13.5కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికను రెండు రోజుల్లో రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ పంచాయతీ రాజ్, ఆర్‌డబ్ల్యుయస్ ఇంజనీర్లను ఆదేశించారు. సోమవారం తన ఛాంబర్‌లో సంబంధిత శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సిమెంట్ రోడ్లు, మురుగు కాలువలు, గ్రామ సచివాలయాల నిర్మాణాలు తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లాలో 845 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయగా ఇందులో 634 సచివాలయాలు ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయన్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న 214 సచివాలయాలకు ప్రభుత్వమే భవనాలు నిర్మించాల్సి ఉందన్నారు. ఇందులో భవనాలు లేని సచివాలయాలు ఎన్ని ఉన్నా ఒక సచివాలయ నిర్మాణం ఈ సంవత్సరంలో చేపడతామన్నారు. సుమారు రూ.40లక్షల అంచనాలతో సచివాలయ భవన నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద మురుగు కాలువల నిర్మాణం చేపట్టాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఉపాధి హామీ నిధులు, మ్యాచింగ్ గ్రాంట్లను వాడుకుని మురికి కాలువలు, గ్రామ సచివాలయాల నిర్మాణం చేపట్టాలన్నారు. ఇందు కోసం రూ.6కోట్లు గ్రామ సచివాలయాలకు, రూ.3.5కోట్లు మురుగు కాలువలకు మరో రూ.2కోట్లు సిమెంట్ రోడ్లకు ఖర్చు చేయాలన్నారు. ఎస్‌టీపీసీ సాంకేతిక పద్ధతులపై మురుగు కాలువల్లో చూపించాలన్నారు. ఆర్‌డబ్ల్యుయస్, పంచాయతీ రాజ్ శాఖల అనుసంధానంతో పాఠశాలల ప్రహరీ గోడలు, శ్మశానాల అభివృద్ధి తదితర పనులను చేయాలన్నారు. మ్యాచింగ్ గ్రాంట్లు 90 శాతానికి ఉపయోగించుకుని మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పార్లమెంట్ నిధులకు కూడా మ్యాచింగ్ గ్రాంట్లు ఉపయోగించుకుని నిర్మాణాలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యుయస్ సీసీ అమరేశ్వరరావు, పంచాయతీ రాజ్ ఇఇ ప్రకాష్ నాయుడు, జెడ్పీ సీఇఓ సూర్యప్రకావరావు, జిల్లా పంచాయతీ అధికారిణి డా. అరుణ, డ్వామా పీడీ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.