కృష్ణ

మహాత్ముని సిద్ధాంతాలు అందరికీ తెలియాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు: దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించిన మహాత్మగాంధీ సిద్ధాంతాలు, ఆశయాలు నేటి తరం వారికి తెలియాలనే ప్రధాన లక్ష్యంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు వై సుజనాచౌదరి చెప్పారు. బీజేపీ చేపట్టిన మహాత్మగాంధీ సంకల్పయాత్ర గురువారం నూజివీడులో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి మాట్లాడుతూ మహాత్ముని ఆశయాలతో ప్రజల్ని చైతన్యవంతులను చేయటంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం అయిందని ఆరోపించారు. గాంధీ మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించే విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుతో దేశం అంతటా ఆగస్టు 15నాడు ఒకే పతాకాన్ని ఎగరవేశారని, ఈ ఘనత ప్రధాన మంత్రి నరేంద్రమోదీదేనని అన్నారు. వైకాపా ప్రభుత్వం ఇసుక కొరత సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని, మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. ఏలూరు పార్లమెంట్ సంకల్పయాత్ర ప్రముఖ్, మాజీ శాసనసభ్యుడు చిన్నం రామకోటయ్య మాట్లాడుతూ సుజనాచౌదరి ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతున్న గాంధీ సంకల్ప యాత్రతో పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా వేగం పుంజుకుందని, రాష్ట్ర పార్టీ పగ్గాలు సుజనాకు అప్పగిస్తే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని, నూజివీడులో కూడా పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందని అన్నారు. రాష్ట్ర తెలుగు యువత మాజీ ప్రధాన కార్యదర్శి నూతక్కి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. వీరికి సుజనాచౌదరి పార్టీ కండువాలు వేసి పార్టీలో చేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, ఉపాధ్యక్షులు ఎం రాజశేఖర్, ఎస్ వసుంధరదేవి, బోను అప్పారావు, మైనార్టీ మోర్చా జాతీయ నాయకులు షేక్ బాజీ, పార్టీ నాయకులు మాటూరి రవికాంత్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.