కృష్ణ

జీ ప్లస్ 3 గృహ లబ్ధిదారులకు అన్యాయం జరగనివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన జీ ప్లస్ 3 గృహ నిర్మాణ లబ్ధిదారులకు అన్యాయం జరిగితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానిక గోసంఘం వద్ద నిర్మించి ప్రారంభానికి నోచుకోని జీ ప్లస్ 3 గృహాలను శుక్రవారం ఆయన బాధిత లబ్ధిదారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలోని అర్హులైన వారందరికీ నివేశన స్థలాలు ఇవ్వాలని సంకల్పించామన్నారు. స్థలాలు లేని కారణంగా సుమారు 16వేల మందికి జీ ప్లస్ 3 గృహ నిర్మాణాలను గో సంఘం, రుద్రవరం గ్రామాల్లో చేపట్టామన్నారు. గో సంఘం వద్ద 6,400 మందికి గాను జీ ప్లస్ 3 గృహ నిర్మాణాలను 70 శాతం పూర్తి చేశామన్నారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న 4వేల ఫ్లాట్లను లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులకు కేటాయించామన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా గృహ ప్రవేశాలు నిలిచిపోయాయన్నారు. ఒకొక్క ఫ్లాట్‌కు లబ్ధిదారులు రూ.25వేలు చొప్పున మున్సిపల్ కమిషనర్ పేరున డీడీలు కూడా చెల్లించారన్నారు. కానీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం జీ ప్లస్ 3 గృహ నిర్మాణాలను పూర్తిగా నిలిపి వేసిందన్నారు. ప్లాట్లు కేటాయింపు జరిగిన లబ్ధిదారులకు సంబంధిత ఫ్లాట్లను అప్పగించకుండా తాత్సారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం నివేశన స్థలాల కోసం నిర్వహిస్తున్న గ్రామసభల్లో అదేమని లబ్ధిదారులు ప్రశ్నిస్తే గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న వారికి, జీ ప్లస్ 3 ఫ్లాట్లు కేటాయింపు జరిగిన వారికి ప్రస్తుతం ఇవ్వమని, ఈ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న వారికే ఇస్తామని అధికారులు చెబుతుండటం గర్హనీయమన్నారు. లబ్ధిదారుల ఎంపిక కూడా వలంటీర్లుగా నియమితులైన వైసీపీ కార్యకర్తలు, వార్డు ఇన్‌ఛార్జ్‌లే చేపడుతున్నారని విమర్శించారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇస్తామన్నారు. అంతేకాకుండా బాధితుల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఇలియాస్ పాషా, మున్సిపల్ మాజీ కో-ఆప్షన్ మెంబర్ గనిపిశెట్టి గోపాల్, మాజీ కౌన్సిలర్ కొట్టె వెంట్రావ్, బత్తిన దాస్, లోగిశెట్టి స్వామి తదితరులు పాల్గొన్నారు.