కృష్ణ

పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లు తగ్గింపు తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు తగ్గింపు వల్ల మధ్య తరగతి ప్రజలు, సీనియర్ సిటిజెన్స్, పెన్షన్‌దారులు, విశ్రాంత అధికారులు నష్టపోయే పరిస్థితి వస్తుందని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీ రేట్లు తగ్గింపు అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి శుక్రవారం ఆయన ఓ లేఖ రాశారు. దేశంలో అత్యధికంగా ఉన్న మధ్య తరగతి ప్రజలు, సీనియర్ సిటిజెన్స్, పెన్షనర్లు, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులంతా తమ కష్టార్జితాన్ని బ్యాంక్‌లలో పొదుపు చేసుకుంటున్నారన్నారు. బయట వ్యక్తులు, ప్రైవేట్ బ్యాంక్‌లు కాదని ప్రభుత్వ బ్యాంక్‌లలోనే తమ కష్టార్జితాన్ని పొదుపు చేసుకుంటున్నారన్నారు. అయితే ఇటీవల రిజర్వు బ్యాంక్ చేపట్టిన ఆర్థిక సంస్కరణల సమీక్షా సమావేశంలోని సూచనల ఆధారంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు 3.5శాతం ఉన్న వడ్టీ రేటును 3.25శాతానికి తగ్గించిందన్నారు. దీన్ని అసరాగా తీసుకుని మిగిలిన ప్రభుత్వ బ్యాంక్‌లు కూడా పొదుపు ఖాతాల డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించే ప్రయత్నం చేసే ప్రమాదం ఉందన్నారు. ఫలితంగా బ్యాంక్‌లలో బ్యాంక్‌లలో సొమ్ము దాచుకునే ఎక్కువ శాతం మంది పేద, మధ్య తరగతి ప్రజల ఆదాయం వడ్డీ రేట్ల తగ్గింపు ఫలితంగా గణనీయంగా ఆదాయం తగ్గే ప్రమాదం ఉందన్నారు. డిపాజిట్లపై వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల దీనిపై ఆధారపడి జీవిస్తున్న ఎంతో మంది పెన్షనర్ల జీవితాలు తమ దైనందిన అవసరాలైన మందులు కోసం కూడా ఎంతో ప్రయాస పడవల్సిన దుస్థితిలో పడిపోతారన్నారు.