కృష్ణ

చెరువులను పరిశీలించిన ఎమ్మెల్యే వసంత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం : సాగర్ జలాల మళ్ళింపు కారణంగా నీటితో నిండిన చెరువులను ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ శనివారం వైసిపి నేతలతో కలసి పరిశీలించారు. చండ్రగూడెం, మెరుసుమల్లి, పొందుగల గ్రామాల్లో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఈసందర్భంగా అక్కడికి చేరుకున్న రైతులు మాట్లాడుతూ గత పదేళ్ళలో ఇంత నిండుగా చెరువులు ఒక్కసారి కూడా నిండలేదన్నారు. ఎమ్మెల్యే కెపికి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే వసంత అంకిత భావంతో పనిచేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. కాగా ఎమ్మెల్యే వసంత మాట్లాడుతూ ప్రజలు, రైతులు తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి స్ఫూర్తితో సేవలందిస్తునట్లు వెల్లడించారు. వైసిపి మండల శాఖ అధ్యక్షుడు పామర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువులేనివి
తోట్లవల్లూరు, అక్టోబర్ 19: దేశ రక్షణ కోసం త్యాగాలు చేసిన పోలీస్ అమరవీరుల సేవలు మరువులేనివని ఎస్‌ఐ చిట్టిబాబు తెలిపారు. పోలీస్ సంస్మరణ దినోత్సవ వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, తదితర పోటీలు నిర్వహించి, వారిలో గెలుపొందిన వారికి బహుమతులు అదజేశారు.
ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ ఇటీవల సైబర్ నేరాలు అధికంగా పెరిగి పోతున్నాయన్నారు. బ్యాంక్‌ల నుంచి ఏటీఎం కోసం ఫోన్ చేస్తున్నామని ఓటీపీ నెంబరు చెప్పాలని తెలిపి బ్యాంక్ ఖాతా నుండి డబ్బులు డ్రాచేసి మోసాలకు పాల్పడుతున్నారని సూచించారు. బంగారం మెరుగు పెడతామని, ఇలా అనేక విధాలుగా మాయమాటలు చెప్పి ఘరానా మోసాలకు పాల్పడుతున్నట్టు విద్యార్థులకు వివరించారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు మాయ మాటలు చెప్పేందుకు ప్రయత్నిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.