కృష్ణ

మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు : మహిళా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, డ్వాక్రా మహిళలకు రుణాలను నాలుగేళ్ళలో మాఫీ చేసే కార్యక్రమాన్ని అతి త్వరలోనే ప్రభుత్వం చేపడుతుందని స్థానిక శాసనసభ్యుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పేర్కొన్నారు. పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం నియోజకవర్గ స్థాయిలో డ్వాక్రా మహిళలకు మెగా రుణమేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అప్పారావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలా మహిళలను మోసం చేయడం, ఎన్నికల ముందు ఓట్ల కోసం పసుపు కుంకుమ వంటి తాయిలాలు ఎగవేయడం వంటివి చేసే ప్రభుత్వం మాది కాదన్నారు. మాట ఇస్తే మడం తిప్పని నైజం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిదన్నారు. రాష్ట్రంలో 1.30 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని, మున్సిపల్ కార్మికులకు, ఆశా వర్కర్లకు, అంగన్‌వాడి వర్కర్లకు వేతనాలు పెంచారని, రైతులకు రైతు భరోసా, ఆటో వాలాలకు 10 వేల రూపాయల సాయం ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం ఈ విధంగా ప్రజల కోసం పనిచేయలేదని కితాబునిచ్చారు. ఈ రుణమేళాలో నూజివీడు, చాట్రాయి, ముసునూరు, ఆగిరిపల్లి మండలాలకు చెందిన 536 గ్రూపులకు 32.59 కోట్ల రూపాయల లింకేజీ రుణాలను, 1138 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు 5.54 కోట్ల రూపాయల స్ర్తినిధి రుణాలను, 224 మందికి యూనిట్‌కు 15 వేల రూపాయల చొప్పున మంజూరు చేశారన్నారు. అనంతరం మహిళలకు లింకేజీ రుణాల చెక్కులు అందజేశారు. నాలుగు మండలాల వెలుగు సిబ్బంది ఎమ్మెల్యే ప్రతాప్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చాట్రాయి మాజీ జడ్‌పీటీసీ సభ్యులు దేశిరెడ్డి రాఘవరెడ్డి, నూజివీడు పట్టణ, ముసునూరు మండలాల అధ్యక్షులు పగడాల సత్యనారాయణ, మూల్పూరి నాగవల్లేశ్వరరావు, వెలుగు డీపీఎం సరళ, నూజివీడు ఏరియా కోఆర్డినేటర్ శారదాంబ, నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు మండలాల ఎంపీడీఓలు జి రాణి, పి భార్గవి, కె పార్థసారథి, ఎపీఎంలు వెంకటరత్నం, డి రాజశేఖర్, పి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మండలంలో డ్వాక్రా మహిళలకు రూ.17.99కోట్ల రుణమాఫీ - ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు
కలిదిండి, అక్టోబర్ 19: మండల డ్వాక్రా మహిళలకు రూ.17కోట్ల 99లక్షలు రుణమాఫీ అయినందుకు డ్వాక్రా మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కైకలూరు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు శనివారం కైకలూరులో చెక్కును డ్వాక్రా మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఇచ్చిన ఆ మాట ప్రకారం డ్వాక్రా మహిళల అకౌంట్లలో నేరుగా నగదు జమ అవుతుందని తెలిపారు. డ్వాక్రా మహిళలు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారన్నారు. రుణమాఫీ వారికి అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా అధ్యక్షుడు నీలపాల వెంకటేశ్వరరావు, వైకాపా రాష్ట్ర మహిళ నాయకురాలు నంబూరి శ్రీదేవి, చిట్టూరు బుజ్జి, డ్వాక్రా మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.