కృష్ణ

ఉపాధి నిధుల సాధన కోసం పార్లమెంట్‌ను ముట్టడిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ పథకం నిధుల కోసం పార్లమెంట్‌ను సైతం ముట్టడిస్తామని శాసనమండలి సభ్యుడు వైవిబి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఈశ్వర్ రెసిడెన్సీలో రాష్ట్ర పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ నిధుల సాధనపై కార్యాచరణ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ, రాష్ట్ర పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవిబి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని విధంగా ఉపాధి హామీ పథకం పెండింగ్ నిధుల పరిస్థితి తయారైందన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు సంబంధించి రూ.2500 కోట్లు కేంద్రం విడుదల చేయగా ఆ నిధులను రాష్ట్రం విడుదల చేయకుండా తాత్సారం చేస్తోందన్నారు. ఈ నిధులతో నవరత్నాలుకు దారి మళ్లిస్తున్నారని ఆగ్రహించారు. నిధుల దారి మళ్లింపు ఉపాధి హామీ చట్టాన్ని ఉల్లంఘించటంతో పాటు రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనన్నారు. నిధుల మళ్లింపు కారణంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తీవ్రంగా నష్టపోవల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నిధుల సాధన కోసం ఛలో ఢిల్లీ కార్యక్రమంతో పాటు పార్లమెంట్‌ను సైతం ముట్టడించేందుకు వెనుకాడబోమన్నారు. అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామన్నారు. నవంబర్ నెలలో ఛలో అమరావతి నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ కక్షసాధింపు వైఖరిని ఎండగడతామన్నారు. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ ఆందోళన కార్యక్రమాల్లో మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు విధిగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఉపాధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి, రాష్ట్ర కార్యదర్శి బత్తిన దాస్, మాజీ ఎఎంసీ చైర్మన్ గోపు సత్యనారాయణ, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

రంజింపచేసిన శ్రీయ లాలిత నృత్యాలు
కూచిపూడి, అక్టోబర్ 19: నాట్యక్షేత్రం కూచిపూడి గ్రామంలో అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి, కూచిపూడి కళాకేంద్రం విశాఖపట్నం సంయుక్త ఆధ్వర్యంలో డా. రామినేని అయ్యన్నచౌదరి, పద్మభూషణ్ డా. వెంపటి చినసత్యంల 90వ జయంతి ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. విశాఖపట్నంకు చెందిన నాట్యాచారిణి, కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డు, యుఎస్‌ఎకు చెందిన డా. రామినేని ఫౌండేషన్ పురస్కార గ్రహీత, కళారత్న ఎబి బాలకొండలరావు శిష్యురాలు చదలవాడ శ్రీయ లాలిత ప్రదర్శించిన కూచిపూడి నాట్యాంశాలు ప్రేక్షకులను సమ్మోహనపర్చాయి. గుంటూరు జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాటూరి నాగభూషణం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో శ్రీయ లాలిత ఆదిశంకరాచార్య విరచిత గణేశ పంచరత్నం, శ్యామశాస్ర్తీ రచించిన సరోజదళనేత్ర అనే అంశాన్ని, శ్రీ సిద్దేంద్రయోగి విరచిత బామాకలాపం ప్రవేశ దరువు, ఆది శంకరాచార్య విరచిత శివాష్టకం, ఊత్‌కాడ్ వెంకట సుబ్బయ్యర్ విరచిత మరకతమణిమయచేల అనే అంశాలతో పాటు ఏబి బాలకొండలరావు నృత్య దర్శకత్వం వహించిన ఓం మంగళ ఓంకార.. అనే అంశాలను ప్రదర్శించి సంగీత నాట్య ప్రియుల సుదీర్ఘ కరతాళ ధ్వనులందుకున్నారు. శ్రీయ లాలిత, బాలకొండలరావులను కళామండలి కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్, అతిథులు దుశ్శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు.

కోడూరులో భారీ వర్షం
కోడూరు, అక్టోబర్ 19: కోడూరు మండలంలో శుక్రవారం రాత్రి మొదలైన వర్షం తెల్లవారే వరకు కురవడంతో పొలాల్లో నీరు భారీగా చేరాయి. గృహాలు జలమయమయ్యాయి. కోడూరు శివాలయంలో గర్భగుడిలోకి నీరు వెళ్లటంతో వాటిని తొలగించటానికి పూజారి నానా అవస్థలు పడ్డాడు. రెవెన్యూ వర్గాల లెక్కల ప్రకారం దివిసీమలో 18.5సెంటీమీర్ల వర్షం కురిసినట్లు చెబుతున్నారు. శనివారం సాయంత్రానికి గాని రోడ్లు బయటపడలేదు. ఈదురు గాలులు లేకపోవటంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకపోవటంతో ప్రజలు ఇబ్బందులు నుండి బయటపడ్డారు. రహదారులపైకి పాములు చేరటంతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. ఇంతటి వర్షం ఇంతకముందు ఎన్నడూ చూడలేదని వృద్ధులు పేర్కొంటున్నారు.

నూజివీడులో జీవాల సంత ఏర్పాటు చేస్తాం
* ఎఎంసీ కార్యదర్శి మంజుల
జగ్గయ్యపేట రూరల్, అక్టోబర్ 19: నూజివీడులో ఎఎంసీ ఆధ్వర్యంలో జీవాల సంత ఏర్పాటు చేయనున్నట్లు ఎఎంసీ కార్యదర్శి జి మంజుల తెలిపారు. శనివారం అక్కడి ఎఎంసీ అధికారులు, సిబ్బంది చిల్లకల్లు నందిగామ జీవాల సంత పరిశీలించారు. జీవాల సంతలో జరిగే వ్యాపార లావాదేవీలు, ఏర్పాటు చేయవలసిన సదుపాయాల గురించి జగ్గయ్యపేట ఎఎంసీ అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఈ సంతలో వ్యాపారులతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. చిల్లకల్లు, నందిగామల్లో శనివారం సంత నిర్వహిస్తున్నందున ఆ రోజున కాకుండా నూజివీడులో గురువారం నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు సూచనలతో తాము సంత పరిశీలించినట్లు కార్యదర్శి తెలిపారు. ఈ కార్యక్రమంలో నూజివీడు ఎఎంసీ మాజీ చైర్మన్ ఎ చిట్టిబాబు, వైకాపా నేతలు బి సాయిబాబు, ఎస్ రాము, పశువైద్యాధికారి సిహెచ్ హనుమంతరావు, సూపర్‌వైజర్ జి ఖాజాబాబు, జగ్గయ్యపేట ఎఎంసీ కార్యదర్శి ఆంజనేయసింగ్, సూపర్‌వైజర్లు వెంకటప్పయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.