కృష్ణ

నైతిక బాధ్యత వహించి వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం : గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలంలో నకిలీ నివేశన స్థలాల పట్టాలను పంపిణీ చేసి ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యే వంశీమోహన్ నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, విజయవాడ రూరల్ మండలాల వైకాపా కన్వీనర్లు తులిమెల్లి జాన్సీరాణి, వింతా శంకర్‌రెడ్డి, దుట్టా శ్రీమన్నారాయణ, ఓంకార్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం స్థానిక నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మీడియాతో వారు మాట్లాడారు. నకిలీ పట్టాలు సృష్టించి వంశీ ఓట్లు దండుకున్నారని వారు ఆరోపించారు. నకిలీ పట్టాలు తయారుచేసిన విషయంపై విశ్రాంత సైనిక ఉద్యోగి ముప్పనేని రవికుమార్ ఫిర్యాదు చేశారు. పట్టాలపై తేదీ, ఆర్‌సీ నంబరు, ఫోటో, ప్లాట్ నంబరు, లే అవుట్ నంబర్లు ఏమీ లేవని ఆఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బాపులపాడు తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణ చేసిన అనంతరం నకిలీ పట్టాలు ఇచ్చినట్లు ఆయన ధృవీకరించినట్లు విలేఖరులకు తెలిపారు. తహశీల్దార్ సంతకం, ప్రభుత్వ సీల్ వేసినట్లు రుజువైందన్నారు. స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్‌పి, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు రవికుమార్ తెలిపారు. ఈ సంఘటనలో నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. వైకాపా అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావుపై వంశీ కేవలం 888 ఓట్ల మెజార్టీతో గెలుపొందారని వారు పేర్కొన్నారు. నకిలీ ఇళ్ళ పట్టాలు మీడియాకు చూపించారు. ఈ కార్యక్రమంలో వైకాపా పట్టణ అధ్యక్షుడు మద్దినేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.