కృష్ణ

బాణసంచా దుకాణాలకు దరఖాస్తుదారుల ఇబ్బందులు తొలగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు) : జిల్లాలో బాణసంచా దుకాణాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అధికారులను ఆదేశించారు. స్థానిక మత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం తమ సమస్యలను తెలియజేసేందుకు వచ్చిన ప్రజలు నుండి వినతిపత్రాలు సతీసుకుని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు అక్కడికక్కడే ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన వ్యాపారులు కొందరు మంత్రిని కలిసి బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో ప్రయత్నించగా సర్వర్ బిజీ కారణంగా సమస్యగా ఉందని, మాన్యువల్‌గా దరఖాస్తులు చేసుకునేందుకు వీలు కల్పించాలని కోరారు. ఈ విషయంపై మంత్రి నాని స్పందిస్తూ ఈ విషయాన్ని పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకవాలని మచిలీపట్నం ఆర్డీఓకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. బాణాసంచా దుకాణాల వద్ద కొనుగోలుదార్లు రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. లైసెన్స్‌లు జారీ చేసే సమయంలో సంబంధిత శాఖల అధికారులు భద్రతా చర్యలను తప్పని సరిగా పరిశీలించాలన్నారు. పట్టణానికి చెందిన ఎనిమిది మంది వలంటీర్లు తమ మొదటి జీతం తమ అకౌంట్లలో జమ అయ్యాయని ఆనందంతో మంత్రికి విన్నవించారు. తామంతా వ్యక్తిగతంగా మంత్రిని కలిసి ఈ విషయం తెలియజేయాలని ఉద్దేశ్యంతో వచ్చామన్నారు. మంత్రి ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా తాము విధులు నిర్వర్తించి పేద ప్రజల వద్దకే సంక్షేమ ఫలాలు తీసుకువెళ్లేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని మంత్రికి తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు పేద ప్రజలు సామాజిక పెన్షన్‌లు, గృహాలు, స్వయం ఉపాధి పథకాలకు రుణాలు మంజూరు చేయాలని కోరుతూ వినతులు సమర్పించారు. వీటిని పరిశీలించి తగుచర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకుమంత్రి పేర్ని నాని ఫోన్ చేసి ఆదేశాలు జారీ చేశారు.