కృష్ణ

ఫొటోగ్రఫీలో నైపుణ్యంతో పాటు మెళుకువలు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్): ఫొటోగ్రఫీలో నైపుణ్యంతో పాటు మెళుకువలు అవసరమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. ఫొటోగ్రఫీలో కొత్త నైపుణ్యాలను నేర్పించి సరికొత్త హంగులతో ఫొటోలు తీయడంలో గ్రామీణ ప్రాంత ఫొటోగ్రాఫర్లకు మెళుకవులను నేర్పించేందుకు వచ్చిన నికాన్ కంపెనీ సాంకేతిక నిపుణులను ఆయన అభినందించారు. సోమవారం స్థానిక వీవీఎస్ గ్రాండ్ ఫంక్షన్ హాలులో గ్రామీణ ఫొటోగ్రాఫర్లకు నికాన్ కంపెనీ ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులకు మంత్రి పేర్ని ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మచిలీపట్నం వేదికగా ఇటువంటి శిక్షణా తరగతులు నిర్వహించడం ముదావహమన్నారు. సినిమా ఫొటోగ్రఫీలో విశేష అనుభవం ఉన్న చోటాకే నాయుడు సహకారం తీసుకుని ఫొటోగ్రాఫర్లకు అవసరమైన సదుపాయాల కల్పనకు వినతిపత్రం తయారు చేసి ఇస్తే ముఖ్యమంత్రి జగన్ వద్దకు మిమ్ముల్ని తీసుకువెళతానని హామీ ఇచ్చారు. ఫొటోగ్రఫీ వృత్తిని బలవంతంగా కాకుండా ఇష్టంతో, మనస్సు పెట్టి ఫొటోలు తీస్తే ఆ సమయంలో వచ్చే ఫొటో ఎంతో నాణ్యతగా ఉంటుందన్నారు. ఫొటోగ్రాఫర్ల జీవితంలో ఎన్నో మరపురాని చిత్రాలు తీసి ఉంటారని, గత చరిత్రను తలచుకొనే విధంగా ఫొటోగ్రఫీ వృత్తిని మలచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫొటోగ్రాఫర్ల సంఘం అధ్యక్షుడు మాదాల రమేష్, ఫొటోగ్రఫీ జాతీయ శిక్షణ నిర్వాహకుడు హుస్సేన్, మచిలీపట్నం డివిజన్ ఫొటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ, అధ్యక్షుడు చిలంకుర్తి శేషు తదితరులు పాల్గొన్నారు.

కదలని వర్షపు నీరు.. తప్పని తిప్పలు..
అవనిగడ్డ, అక్టోబర్ 21: గత మూడు రోజులుగా అవనిగడ్డ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నీరు కదలని పరిస్థితి గ్రామీణ ప్రాంతాలలో కూడా నెలకొంది. మండల పరిధిలోని అశ్వరావుపాలెం, కొత్తపేట గ్రామాలలో నీరు కదలని కారణంగా ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అశ్వరావుపాలెంలోని పొట్టూరు చెరువు రోడ్డు వర్షం నీటిలో తేలియాడి ఉండటంతో పంచాయతీ సిబ్బంది కొందరు కార్మికులను ఏర్పాటు చేసి గ్రామస్థులు వాడుకునే మంచినీటి చెరువులోకి వర్షం నీటిని మళ్లించే పనులను ప్రారంభించారు. వర్షం కురిసి మూడు రోజులైనా గృహాలలో వర్షం నీరు నిల్వ ఉండి కదలడం లేదు. గృహాలు ముందు ఏర్పాటు చేసుకున్న ధాన్యం పురులు వర్షం నీటికి దెబ్బతింటాయనే ఆందోళనలో రైతులు ఉన్నారు. స్థానిక పంచాయతీ పరిధిలోని 19, 20 వార్డులు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి. మంచినీరు కూడా కలుషితమయ్యే ప్రమాదం నెలకొంది. డ్రైనేజీ వ్యవస్థపై గత ఐదు సంవత్సరాలుగా పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయాలు, జిల్లా కలెక్టర్‌కు అనేక సార్లు లిఖిత పూర్వకంగా సమస్యలను వివరిస్తున్నా పట్టించుకోలేదని, గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఈ ప్రభుత్వం కూడా చేస్తోందని బీజెపీ నేత భూపతి సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సింహాద్రి కాలనీలో నీరు ఇంకా కదలని పరిస్థితి ఉండటంతో కాలనీ వాసులే నీరు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా పంచాయతీ అధికారులు డ్రైన్‌లలో పూడికతీయటం ప్రారంభమైనా ఆశించిన ఫలితాలు కనిపించటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జాతీయ స్థాయి పోటీలకు విన్నకోట విద్యార్థి
గుడ్లవల్లేరు, అక్టోబర్ 21: మండల పరిధిలోని విన్నకోట జెడ్పీ హైస్కూలులో 9వ తరగతి చదువుతున్న జన్ను జగదీష్ జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యాడు. కృష్ణా జిల్లా తరపున త్రోబాల్ పోటీల్లో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు అనంతపురంలో 65వ స్కూల్ గేమ్స్ త్రోబాల్ పోటీల్లో తన సత్తా చాటాడు. ఎంపికైన జగదీష్ నవంబర్ మొదటి వారంలో 65వ స్కూల్స్ గేమ్స్ న్యూఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటాడని ప్రధానోపాధ్యాయుడు బాలాజీ తెలిపారు. చిన్న వయస్సులోనే జగదీష్ తండ్రి చనిపోవటంతో తల్లి కనకదుర్గ వ్యవసాయ కూలీ చేసుకుంటూ జగదీష్‌ను చదివిస్తోంది. మొదటి నుండి ఆటలపై ఆసక్తి ఉన్న జగదీష్ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయితో పాటు అంతర్జాతీయ స్థాయి వరకు ఎదగటం గర్వకారణమని పీఇటీ అనిల్ కుమార్ పేర్కొన్నారు. పాఠశాలలో సోమవారం జరిగిన కార్యక్రమంలో హెచ్‌ఎం, అధ్యాపకులు జగదీష్‌ను అభినందించారు.