కృష్ణ

జీ ప్లస్ 3 గృహాలపై దుష్ప్రచారానికి తెర దించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్): గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన జీ ప్లస్ 3 గృహాలపై జరుగుతున్న దుష్ప్రచారంపై లబ్ధిదారులకు వాస్తవ విషయాలు తెలియజేయాలని మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో టీడీపీ నేతలు, మాజీ కౌన్సిలర్లతో కలిసి వినతిపత్రం అందజేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నివేశన స్థలాలు లేని ప్రతి ఒక్కరికీ జీ ప్లస్ 3 కింద గృహ నిర్మాణాలు చేపట్టామన్నారు. గో సంఘం వద్ద 6,400 మందికి, రుద్రవరం వద్ద 4వేల మందికి జీ ప్లస్ నిర్మాణాలు జరగ్గా దాదాపు నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఫ్లాట్‌కు రూ.25వేలు చొప్పున లబ్ధిదారులు డీడీలు చెల్లించగా వారందరికీ లాటరీ ద్వారా ఫ్లాట్ల కేటాయింపు చేశామన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో సదరు ఫ్లాట్లు మీకు రావంటూ ఆ పార్టీ వార్డు ఇన్‌ఛార్జ్‌లు దుష్ప్రచారం చేస్తూ లబ్ధిదారులను అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. వీటిపై పూర్తి స్థాయి విచారణ జరిపి డీడీలు చెల్లించిన ప్రతి ఒక్కరికీ ఫ్లాట్లు అప్పగించాలని బాబా ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాధం (చంటి), టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఇలియాస్ పాషా, ఎఎంసీ మాజీ చైర్మన్ మరకాని పరబ్రహ్మం, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు గనిపిశెట్టి గోపాల్, మాజీ కౌన్సిలర్లు కొట్టె వెంకట్రావ్, లోగిశెట్టి స్వామి, సైకం శ్రీను, టీడీపీ నాయకులు అబ్దుల్ అజీమ్, అమీర్, పద్మనాభుని శేఖర్ తదితరులు పాల్గొన్నారు.