కృష్ణ

నగరం.. జలమయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు): అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ కారణంగా మచిలీపట్నం నగరం కొద్దిపాటి వర్షానికి జలదిగ్బంధానికి గురవుతోంది. మంగళవారం తెల్లవారు జాము నుండి సాయంత్రం వరకు కురిసిన భారీ వర్షానికి నగరమంతా జలమయమైంది. ప్రధాన రహదార్లతో పాటు అంతర్గత రహదార్లపై సైతం వర్షపు నీరు నిల్వ ఉండి అటు వాహనచోదకులు, ఇటు పాదచారులకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను తీసుకు వచ్చింది. డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా మారటంతో వర్షపు నీరు పారక రోడ్ల మీద పొంగి పొర్లుతున్నాయి. నగరంలోని పల్లపు ప్రాంతాలన్నీ వర్షపు నీటిలో తేలియాడుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్, కోనేరుసెంటరులో వర్షం నీరు భారీగా చేరటంతో ప్రయాణీకులు నానా అవస్థలు పడ్డారు. లోతట్టు ప్రాంతాలైన టెంపుల్ కాలనీ, డ్రైవర్స్ కాలనీ, శివగంగ, నారాయణపురం యానాదుల కాలనీ, ఎస్టీ కాలనీ, శారదానగర్, రైలుపేట, వైఎస్‌ఆర్ కాలనీ తదితర కాలనీలు వర్షం నీటిలో తేలియాడుతున్నాయి. అక్కడి ప్రజలు దుర్గంధం భరించలేక, బయటకు రాలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. డ్రైన్‌లు పూడుకుపోవటంతో నీరు పారుదల కాకపోవటంతో నగరం మురికి కూపంగా తయారైంది. వ్యర్థాలతో రహదారులు దుర్గంధం వెదజల్లుతున్నాయి. కార్పొరేషన్ అధికారులు స్పందించి వ్యర్ధాలను తొలగించి బ్లీచింగ్, ఆయిల్ బాల్స్‌ను వెంటనే వేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలని నగరవాసులు కోరుతున్నారు.