కృష్ణ

ఇసుక సరఫరాలో దళారుల జోక్యాన్ని నివారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, : జి.కొం డూరు మండలంలో స్థానిక వాగుల్లో ఇసుక తవ్వకాలు, సరఫరాలో మధ్య దళారుల జోక్యం నివారించాలని సిఐటియు మండల కార్యదర్శి కొంక బాలకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం నాలుగున్నర టన్నులకు గానూ 1,283 రూపాయలు వసూలు చేస్తుండగా, ట్రాక్టర్ లోడింగ్, కిరాయి కలుపుకుని రూ.4వేలు ఖర్చవుతుందన్నారు. ప్రభు త్వ అనుమతులు లేనప్పుడు కూడా ఇదే విధంగా ఇసుకను విక్రయించారన్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ధరలు మాత్రం తగ్గలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎవరికి ఇసుక అవసరమో వారికే నేరుగా కిరాయితో కలిపి సొమ్ము తీసుకుని సరఫరా చేయాలన్నారు. దూరాన్ని బట్టి కిరా యి ధరలను ప్రభుత్వమే నిర్ణయించాలన్నారు. ఇసుక రీచ్‌ల్లో ఎక్కువ లోతు తవ్వకుండా పర్యవేక్షించి, భూగర్భజలాల మట్టం తగ్గకుండా చూడాలన్నారు.
సినీ నిర్మాత కేఎల్ నారాయణ ఇంటిపై
కొనసాగిన ఐటీ దాడులు
ముదినేపల్లి, నవంబర్ 8: అవంతి ఫీడ్స్ పై ఆదాయ పన్ను శా ఖాధికారులు హైదరాబాద్ తదితర చోట్ల దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ సంస్థ అధినేత అల్లూరి ఇం ద్ర కుమార్‌కు బంధువైన ముదినేపల్లి మం డలం పెదగొన్నూరు కు చెందిన ప్రముఖ సినీ నిర్మాత, దుర్గా ఆర్ట్స్ అధినేత కెఎల్ నారాయణ గృహంలో గురువారం నుండి శుక్రవారం వరకు ఆదాయ పన్ను శాఖాధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ ఆదాయ పన్ను శాఖాధికారి ఆదేశానుసారం విజయవాడ అసిస్టెంట్ ఇన్‌కమ్ టాక్స్ అధికారిణి ఎం శే్వత తమ సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలోని అవంతి ఫీడ్స్ ఏజెంట్లు, డిస్టిబ్యూటర్లు తదితరులపై విజయవాడ నుండి బయలుదేరిన 15 బృందాలు ఈ దాడిలో పాల్గొన్నాయన్నారు. విశాఖపట్నం, భీమవరం, కొవ్వూరు, తణుకు తదితర చోట్ల ఈ దాడులు జరిగాయన్నారు. ఈ దాడు లో రెండు పురాతనమైన లాకర్లు ఈ గృహంలో ఉన్నాయని, సంబంధిత తాళాలు ఏమయ్యాయని కెఎల్ నారాయణను ఫోన్‌లో సంప్రదించగా తాను చైనాలో ఉన్నానని, వాటి తాళాలు తన దగ్గర లేవని తెలిపారన్నారు. ఆ లాకర్లను తెరిచేందుకు సంబంధిత వ్యక్తులు అందుబాటులో లేరన్నారు. ఈ క్రమంలో వారి కోసం ఎదురు చూస్తున్నామని, ఉన్నతాధికారుల ఆదేశం మేరకు వాటిని ఓపెన్ చేయటం జరుగుతుందని తెలిపారు.