కృష్ణ

భక్తులతో పోటెత్తిన మోపిదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి: మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం భక్తులతో పోటెత్తింది. ఉదయం నుండే రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసిన భక్తులు స్వామివారి నాగపుట్టలో పాలుపోసి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఒడుగులు, చెవిపోగులు, పాలపొంగళ్లు, కేశఖండనలు, అన్నప్రాసనలు తదితర మొక్కుబడులు తీర్చుకున్నారు. నౌడూరి విశ్వనాధ సుబ్రహ్మణ్య శర్మ స్వామివారి శాంతి కల్యాణం శాస్త్రోకంగా నిర్వహించారు. ఆలయ ఏసీ జివిడీఎన్ లీలాకుమార్, సూపరింటెండెంట్ ఎ మధుసూధనరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే స్థానిక శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర చెట్టు వద్ద కార్తీక వన సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సహకారంతో శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వద్ద అయ్యప్పలు ప్రత్యేక భజనలు నిర్వహించారు. మండల స్థాయిలో భక్తులు పాల్గొని అన్నదానం స్వీకరించారు.