కృష్ణ

దేశ విద్యా వ్యవస్థలో మార్పుల ద్వారానే అందరికీ విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్): దేశ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం ద్వారా అందరికీ విద్యను అందించడం సాధ్యమవుతుందని కృష్ణా విశ్వ విద్యాలయం ఇన్‌ఛార్జ్ ఉపకులపతి ఆచార్య వైకె సుందర కృష్ణ అన్నారు. భారత తొలి విద్యా శాఖ మంత్రి వౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంత్యుత్సవాన్ని సోమవారం విశ్వ విద్యాలయంలో నిర్వహించారు. ఉపకులపతి సుందర కృష్ణతో పాటు రిజిష్ట్రార్ ఆచార్య కె కృష్ణారెడ్డి, అద్యాపక బృందం ఆజాద్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుందర కృష్ణ మాట్లాడుతూ దేశం సంపూర్ణ అక్షరాస్యత సాధించడం ద్వారానే వౌలానా ఆజాద్‌కు నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వపు రిజిష్ట్రార్ ఎన్ ఉషా, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.