కృష్ణ

ఆరు నెలల పాలనలో పేదరికాన్ని రోడ్డున పడేసిన జగన్ సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరు నెలల పాలనలో పేదరికం రోడ్డున పడిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆరు నెలల జగన్మోహనరెడ్డి ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు. ఏ వర్గాన్ని చూసినా తీవ్రమైన కష్టాలు, ఇబ్బందులు పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ప్రధానంగా ఇసుక సమస్య రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందన్నారు. మద్యం పాలసీకి ఇచ్చిన ప్రాధాన్యత సామాన్యుడి అవసరాలు తీర్చే ఇసుక పాలసీకి ఇవ్వలేదన్నారు. నూతన ఇసుక పాలసీ కోసం గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇసుక పాలసీని రద్దు చేసిన జగన్ మద్యం విషయంలో దుకాణాల టెండర్లు ముగిసినా నూతన ఎక్సైజ్ పాలసీ అమలులోకి వచ్చే వరకు ఎందుకు పొడిగించారని ప్రశ్నించారు. ఇసుక కొరత వల్ల పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి చలనం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక సమస్య ప్రభుత్వం కల్పించిన కృత్రిమ కొరతేనన్నారు. వైసీపీ అనుయాయులకు లబ్ధి చేకూర్చేందుకు నూతన ఇసుక విధానాన్ని తీసుకువచ్చి అడ్డదార్లో దోచి పెడుతున్నారని విమర్శించారు. వరదల వల్ల ఇసుక లేదంటున్న ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో రాష్ట్ర సరిహద్దులకు ఇసుక ఏ విధంగా తరలి వెళుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం వరదలను బూచిగా చూపుతున్నారన్నారు. కర్ణాటక, మహారాష్ట్రాల్లో కూడా వరదలు రాగా ఆ రాష్ట్రాల్లో ఇసుక కొరత ఎందుకు లేదని ప్రశ్నించారు. ఇసుక కృత్రిమ కొరతపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు గాను తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 14వతేదీన విజయవాడలో నిరసన దీక్ష చేపట్టనున్నారన్నారు. ఇసుక సమస్యను జాతీయ స్థాయికి తీసుకు వెళతామన్నారు. చంద్రబాబు దీక్షకు అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరో పక్క ప్రభుత్వ పాఠశాలల్లో మాతృ భాష తెలుగు మీడియంకు తిలోదకాలు ఇవ్వడం గర్హనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆంగ్ల రాష్ట్రంగా మార్చేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోందన్నారు. తెలుగు మీడియంను రద్దు చేయడం మాతృ భాష తెలుగును తిరోగమనం పాలు చేయడమేనన్నారు. మిషన్ బిల్డ్ పేరుతో రాష్ట్రాన్ని అమ్మేసేందుకు అంకురార్పణ చేశారన్నారు. గతంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల ఎకరాలు దోచుకుని 12 కేసుల్లో ప్రథమ ముద్దాయిగా ఉన్న జగన్ నేడు సీఎంగా రాష్ట్రంలోని విలువైన ఆస్తులను దోచుకునేందుకు మిషన్ బిల్డ్ అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టారని మాజీ మంత్రి రవీంద్ర విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, ఎఎంసీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఇలియాస్ పాషా, కార్యదర్శి పిప్పళ్ల కాంతారావు, తెలుగు మహిళ పట్టణ అధ్యక్షురాలు లంకిశెట్టి నీరజ, తదితరులు పాల్గొన్నారు.