కృష్ణ

నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్): నడక ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులు కావచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. టివిఎస్‌ఎన్ శాస్ర్తీ అన్నారు. ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచేందుకు మచిలీపట్నం నగర పాలక సంస్థ, శృతి ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నగరంలో 2కె రన్ నిర్వహించారు. 2కె రన్‌ను ప్రారంభించిన డా. శాస్ర్తీ మాట్లాడుతూ మన అలవాట్లే ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం, ఉదయపు నడకతో సుదీర్ఘ వ్యాధులను సైతం దూరం చేయవచ్చన్నారు. అనంతరం నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ఉచిత షుగర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్ దాదా, ఎఆర్ డీఎస్పీ సత్యనారాయణ, శృతి ఆస్పత్రి యండీ డా. కోదరాజు సంజయ్, చైర్మన్ కె శేఖర్, పబ్లిక్ హెల్త్ విభాగం ప్రతినిధులు ఎవి సత్యనారాయణ, జుజ్జవరపు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తోట్లవల్లూరు మండలంలో
16లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులోకి తీసుకువస్తాం
* సబ్ కలెక్టర్ ధ్యానచంద్
తోట్లవల్లూరు, నవంబర్ 14: తోట్లవల్లూరు మండలంలోని అన్ని ఇసుక రీచ్‌ల నుంచి 16లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుకను అందుబాటులోకి తీసుకు వస్తామని సబ్‌కలెక్టర్ ధ్యానచంద్ర తెలిపారు. గురువారం తహశీల్దార్ వెంకట శివయ్యతో కలసి రొయ్యూరు క్వారీ, స్టాక్ పాయింట్‌లను పరిశీలించారు. ట్రాక్టర్‌లకు ఏవిధంగా లోడింగ్ చేస్తున్నారో పరిశీలించారు. అక్కడ ఉన్న ఏపీఏండీసీ అధికారులను కలిసి క్వారీలో నిర్వహిస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇసుక సరఫరా చేయాలని సూచించారు. రెండు ఔట్‌పోస్ట్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేయటాన్ని చూసి రెవెన్యూ, పోలీస్ అధికారులను అభినందించారు. దీనివల్ల అక్రమ ఇసుక రవాణా జరగకుండా అరికట్టేందుకు బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం వల్లూరుపాలెంలో క్వారీని, ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్టాక్‌పాయింట్‌ను పరిశీలించారు. కృష్ణానదిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిందని, కనుక అందుబాటులో ఉన్న క్వారీలను త్వరగా తెరచి ఇసుక సరఫరా చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ కిషోర్, ఎస్‌ఐ చిట్టిబాబు తదితరులు ఉన్నారు.