కృష్ణ

అందరికీ అందుబాటులో ఇసుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు: నూజివీడు నియోజకవర్గంలోని ప్రజలందరికీ అందుబాటులో ఇసుక ఉంచేందుకు ఏర్పాట్లు చేశామని నూజివీడు శాసనసభ్యుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు చెప్పారు. స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఇసుక స్టాక్ పాయింట్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ భవన నిర్మాణ దారులకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇసుకపై ప్రతిపక్ష పార్టీలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ఇసుక మాఫియా నడిపిన ఘనత టీడీపీదేనని ఆరోపించారు. నూజివీడు నియోజకవర్గ ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేశామని, దీనిని భవన నిర్మాణదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు మండల తహశీల్దారు సురేష్‌బాబుతో పాటు పలువురు అధికారులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

వెల్లటూరులో నాడు నేడు
జి.కొండూరు, నవంబర్ 14: వెల్లటూరులో మనబడి నాడు నేడు కార్యక్రమం గురువారం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి సీనియర్ నేత గుమ్మడపు రవీంద్రరాణా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలలో వౌలిక వసతుల కల్పనకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులకు ఉన్నతమైన వసతులు కల్పించడానికి శ్రీకారం చుట్టారన్నారు. తాగునీరు, భవనాలు, ట్యూబులైట్లు, ఫ్యాన్లు, ఇంగ్లీషు, సైన్సు ల్యాబులు, భవనాలకు రంగులు, బెంచిలు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. హెచ్‌ఎం శ్రీనివాసరావు, పంచాయితీ కార్యదర్శి వై.బసవలింగేశ్వరరావు, పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు మలరాజు నారాయణ, ఉపాధ్యక్షురాలు పచ్చిగోళ్ళ సుజాత, మాజీ ఎంపిటిసి కోటయ్య, వైసిపి నేత అభేద్నగో తదితరులు పాల్గొన్నారు.