కృష్ణ

నవరత్నాల అమలుకు సమర్థవంతంగా పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు, వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులైన వారందరికీ లబ్ధి కలిగించేందుకు జిల్లా స్థాయి అధికారుల నుంచి గ్రామ వలంటీర్ల వరకూ సమర్థవంతంగా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సూచించారు. ఈమేరకు శనివారం కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్‌తో కలిసి రూరల్ మండలం గూడవల్లి గ్రామంలో నవరత్నాల పథకాల అమలు తీరును పరిశీలించిన ఆమె మాట్లాడుతూ విధుల నిర్వహణలపై ఎటువంటి లోపాలకు తావు లేకుండా అన్ని స్థాయిల అధికారులు బాధ్యతాయుత సేవలందించాలన్నారు. అనంతరం వైఎస్‌ఆర్ రైతు భరోసా ఏవిధంగా తోడ్పాటునిస్తుందన్న విషయంపై అక్కడి రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నంలో పలువురు రైతులను పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు కొలుసు వేణుగోపాల్, ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్ రైతు భరోసా కింద తొలుత రూ.12,500లు ప్రకటించినప్పటికీ, తదుపరి సీఎం జగన్ ఆ మొత్తాన్ని రూ.13,500 లకు పెంచి ఇవ్వడం అభినందనీయమని తెలిపారు. ఇటువంటి పథకం కౌలు రైతులకు అమలుచేయడం ఇదే మొదటి సారని, రైతులకు ఈ పథకం దేవుడిచ్చిన వరం లాంటిదన్నారు. అలాగే విభిన్నప్రతిభావంతుడు పెటేటి సురేష్ మాట్లాడుతూ గతంలో తమకు 2వేల పేన్షన్‌ను 3వేలకు పెంచి ఇవ్వడంతో తమ కుటుంభ ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయని తెలిపారు. తదిపరి రూరల్ తహశీల్ధార్ వనజాక్షి మాట్లాడుతూ మండలంలో ఇళ్ల స్థలాల కోసం 17వేల 608 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఈ దరఖాస్తులను గ్రామ వలంటీర్లు పరిశీలన చేసిన అనంతరం 6,229 మందిని ప్రాధమికంగా అర్హులుగా గుర్తించడం గుర్తించి, 6 విడతల పరిశీలన అనంతరం వారిలో 3522 మంది అర్హులుగా గుర్తించామన్నారు. వీరికి ఇళ్ల స్థలాలు అందించేందుకు 184 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా గుర్తించామని, ఇళ్ల స్థలాల కోసం అర్హులైన వారి జాబితాను ప్రకటించడం ద్వారా సోషల్ ఆడిట్ నిర్వహించామన్నారు. గ్రామ సచివాలయం మహిళా సంరక్షణాధికారి సౌజన్య మాట్లాడుతూ తాను బీఎస్సీ కంప్యూటర్స్ చదివి, గృహిణిగా ఉండగా గ్రామ సచివాలయం ఉద్యోగానికి పరీక్ష రాసి ఉద్యోగానికి ఎంపికైన విషయం తనకు ఎంతో సంతోషదాయకంగా ఉందని వివరించారు.