కృష్ణ

కోతలకు సిద్ధమవుతున్న వరి పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి: మొవ్వ మండలంలో వరి పంట కోతలకు సిద్ధమైంది. దీంతో రైతులు, కూలీలు ఆనందంగా ఉన్నారు. ఈ ఏడాది అనావృష్టితో ప్రారంభమైనా వరి సాగు చివరకు వద్దంటే నీరు అన్నచందాన సాగునీరు లభ్యమవటంతో రైతులు ఖరీఫ్ సాగు చేపట్టారు. మొవ్వ మండలంలో 11,170 హెక్టార్లలో సాగు చేసిన వరి పైరు కోతలకు సిద్ధమైంది. సాగునీటిపై ఆశలు కొరవడినా మండలంలోని పలువురు రైతులు బోర్లకింద నారుమడులు పోసి జూలై నెలలోనే సాగుకు సిద్ధమయ్యారు. ఆగస్టు చివరి నుండి కృష్ణా జలాలు లభ్యం కావటంతో వరి నాట్లు ముమ్మరంగా జరిగాయి. ఈ విధంగా సాగైన వరి పంట ప్రస్తుతం కోతలకు సిద్ధమవుతుండగా, ముందుగా నాట్లు వేసిన వరి పొలాలు నాలుగు రోజుల్లో కోతలకు సిద్ధమవుతున్నాయి. రైతులు బాటలు తీస్తున్నారు. ఈ విడత ఆలస్యంగా నాట్లు వేసిన వరి పంట మొవ్వపాలెం, వేములమడ, కోసూరు, పెదముత్తేవి గ్రామాలలో సైతం కోతలకు సిద్ధమైంది. కాజ, పద్దారాయుడుతోట, నిడుమోలు, మంత్రిపాలెం, అవిరిపూడి, పాలంకిపాడు తదితర గ్రామాల రైతులు బీపీటీ సాగు చేశారు. ప్రభుత్వం కిలో రూ.5 సబ్సిడీపై బీపీటీ, ఎంటీయు 1061 సరఫరా చేసింది. ప్రైవేటు దుకాణాలు వద్ద ఎంటీయు 2231, 2077, 1224, 1121, 1075, నూజివీడు సంపత్ రకాలను కొనుగోలు చేసి సాగు చేశారు. ఈ నేపథ్యంలో వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా ఎండు తెగులు తదితర తెగుళ్లు సోకి ఆందోళన చెందుతున్న రైతన్నలకు ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా రూ.7,500లు అందించడం కొంత ఊరటనిచ్చింది. మండలంలో పౌర సరఫరాల శాఖ ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు మూడు కేంద్రాలకు అనుమతి మంజూరు చేసింది. మొవ్వ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇప్పటికే మొవ్వ, కోసూరు, అయ్యంకి తదితర గ్రామాలలో పీఎసీఎస్‌ల ద్వారా కొనుగోళ్లకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ముతక రకం క్వింటాల్ 1810, ఎ గ్రేడ్ రకం రూ.1835కు కొనుగోలు చేసేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధంగా ఉందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఈ ఏడాది కొన్నికొన్ని గ్రామాలలో వాతావరణంలో ఏర్పడిన సమస్యలు కారణంగా దిగుబడులు ఎకరాకు రూ.30 నుండి 35 బస్తాల దిగుబడి అయ్యే అవకాశం ఉందని ఎఓ శివప్రసాద్ తెలిపారు. వరి పంట కోతలకు సిద్ధం కావటంతో కొడవళ్ల తయారీలో కుమ్మర్లు సిద్ధం కాగా, మేమున్నామంటూ తమిళనాడు, కేరళ, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల నుండి తరలి వచ్చిన కోత మిషన్‌లు మొవ్వ మండలానికి తరలి వస్తున్నాయి. సాంప్రదాయ వరి కోతలకే రైతులు ఆసక్తి చూపుతున్నారు.

నూతన ఆక్విడెక్ట్ నిర్మాణానికి సహకరించాలి
* ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీరుకు ఎమ్మెల్యే వినతి
అవనిగడ్డ, నవంబర్ 16: మండల పరిధిలోని పులిగడ్డ ఆక్విడక్టును నీటి పారుదల శాఖ క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీరు ఎం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సింహాద్రి మాట్లాడుతూ 1936లో నిర్మించిన పులిగడ్డ ఆక్విడక్టు నాణ్యత భయాందోళనకు గురి చేస్తోందన్నారు. దివిసీమ రైతులు, ప్రజలకు జీవనాధారమైన ఆక్విడక్టుకు ఏమైనా జరిగితే నీరందక వేలాది ఎకరాల పంటలు బీడువారుతాయన్నారు. ఆక్విడక్టును పరిశీలించి ప్రభుత్వానికి నివేదించి నూతన ఆక్విడక్టు నిర్మించేందుకు సహకరించాలని చీఫ్ ఇంజనీర్‌ను ఎమ్మెల్యే సింహాద్రి కోరారు. ఈ కార్యక్రమంలో ఇఇ ఉమామహేశ్వరరావు, డీఇ విజయ్ కుమార్, వెంకటేశ్వరరావు, టీడీపీ జిల్లా కార్యదర్శి కె నరసింహారావు, నియోజకవర్గ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు రేపల్లె వెంకటేశ్వరరావు, మోహన శివరాజియ్య తదితరులు పాల్గొన్నారు.

కుట్టు మిషన్ల పంపిణీ
కూచిపూడి, నవంబర్ 16: మొవ్వ మండలం కాజ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులకు క్రాప్ట్‌లో శిక్షణ ఇస్తున్న ఎన్ విజయశ్రీ కృషి ప్రశంసనీయమని అమెరికాకు చెందిన హార్స్‌హోమ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా నిర్వాహకురాలు డా. నెల్లి, డా. జోషి ప్రశంసించారు. ఫౌండేషన్ సంస్థ పాఠశాల విద్య పూర్తి చేసిన బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందింప చేసేందుకు రెండు కుట్టు మిషన్‌లు ద్వారా టైలరింగ్, ఎంబ్రాయిడరింగ్‌తో పాటు బ్యూటీషియన్‌లో పూర్తి స్థాయిలో శిక్షణ పొందాలని బాలికలకు సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం ఆవుల ఆంజనేయ ప్రసాద్‌కు కుట్టుమిషన్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు మందా శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్ ప్రభాకర్, పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.