కృష్ణ

సమాజానికి దిక్సూచి పత్రికా రంగమే - డీఆర్‌ఓ ప్రసాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్): సమాజానికి దిక్సూచి పాత్రికేయ రంగమేనని జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్ అన్నారు. జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీయుడబ్ల్యుజే మచిలీపట్నం శాఖ, డా. పట్ట్భా రెడ్‌క్రాస్, ఆంధ్ర ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో శనివారం స్థానిక పట్ట్భా రెడ్‌క్రాస్‌లో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఆర్‌ఓ ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో నెలకొన్న సమస్యలను వెలికి తీయడంలో పాత్రికేయ రంగం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రస్తుత సమాజంలో అన్ని రంగాల్లోనూ పోటీతత్వం పెరిగింది. ముఖ్యంగా పత్రికా రంగంలో పోటీ ఎక్కువైందన్నారు. సమాచార సేకరణలో నిత్యం ఒత్తిళ్లకు గురయ్యే పాత్రికేయులు తమ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధన సాధ్యమన్నారు. ఆరోగ్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు మాట్లాడుతూ పాత్రికేయులు పత్రికల విలువలను కాపాడుతూ నిష్పక్షపాతంగా వార్తలు రాయాలన్నారు. సాంకేతిక పరమైన మార్పులకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలన్నారు. ఆర్డీవో ఖాజావలి మాట్లాడుతూ పత్రికా రంగానికి పుట్టినిల్లు మచిలీపట్నం అన్నారు. కృష్ణ పత్రిక ద్వారా ముట్నూరు కృష్ణారావు స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారన్నారు. అనంతరం పలువురు సీనియర్ పాత్రికేయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీయుడబ్ల్యుజే ఎలక్ట్రానిక్ విభాగం జిల్లా అధ్యక్షుడు నంగేగడ్డ బాబు, జిల్లా కార్యవర్గ సభ్యుడు మామిళ్లయ్య, పట్టణ శాఖ అధ్యక్షుడు చలమలశెట్టి రమేష్, కార్యదర్శి శ్రీరామ్, అబ్దుల్ కలామ్ హెల్త్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డా. అచ్చుతబాబు, ప్రముఖ వైద్యులు డా. దినేష్, డా. భాస్కరరెడ్డి, డా. ఉషారాణి, డా.పట్ట్భా రెడ్ క్రాస్ కార్యదర్శి జి పాపరాజు తదితరులు పాల్గొన్నారు.

జనసేన ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు భోజన వసతి
మచిలీపట్నం (కోనేరుసెంటర్), నవంబర్ 16: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు డొక్కా సీతమ్మ పేరిట స్థానిక జనసేన కార్యాలయం వద్ద రెండవ రోజైన శనివారం కూడా భవన నిర్మాణ కార్మికుల కోసం ఉచిత భోజన వసతి కల్పించారు. మచిలీపట్నం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బండి రామకృష్ణ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గడ్డం రాజు, తాతిలు, చిరంజీవి, కుమారి, మోకా రవి, గణేష్, యాదర శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా అయ్యప్ప స్వామి పడి, కుంభాభిషేక మహోత్సవం
మండవల్లి, నవంబరు 16: మండలంలోని లోకుమూడిలో ఏలూరు రోడ్డులో వేంచేసియున్న శ్రీఅయ్యప్పస్వామి దేవస్థానంలో ఏకశిల పదునెట్టంబడి (18 మెట్లు), ద్వారపాలక, శ్రీవిఘేశ్వరస్వామి, శ్రీగంగానమ్మతల్లి విగ్రహాల ప్రతిష్ట, కుంభాబిషేకం మహోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మాజీ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ దేవస్థానంలో అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీ్ధర్, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ఆలయ పడి, ద్వారపాలక, కుంభాభిషేక మహోత్సవ గోడపత్రికలను ఆవిష్కరించారు. కలియుగదైవమైన అయ్యప్ప స్వామిని భక్తులు నిత్యం కొలిచి తరించాలని ఎంపీ, ఎమ్మెల్యేలు కోరారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆర్థిక సహకారంతో ఏకశిలను విరాళంగా అందజేశారు. దేవాలయంలో పుల్లేటికుర్తి గణపతిశర్మ పర్యవేక్షణలో పాలకుర్తి ప్రేమ్‌చంద్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం బింబశుద్ది, పునఃపూజ, గోపూజ, వేదస్వస్తి, గణపతిపూజ, ప్రతిష్ట సంకల్పం, పుణ్యాహావాచన, సాయంత్రం అంకురారోహణ, మూర్తి హోమము, షడ్రుచి హోమము, మూలమంత్ర హోమము, పుర్ణాహూతి, దంవజరోహణ కార్యక్రమాలను ఘనంగా జరిపించారు.