కృష్ణ

మాటల గారడీకే పరిమితమైన ‘కూచిపూడి’ అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి: గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూచిపూడిని అభివృద్ధి చేస్తానంటూ 2000 సంవత్సరం నుండి వాగ్ధానాల పరంపర కొనసాగించినా అమలుకు మాత్రం నోచుకోలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలన సమయంలో కూచిపూడి కొంతమేర అభివృద్ధి చెందింది. రాజశేఖరరెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సమయంలో అభివృద్ధికి నోచుకోని కూచిపూడి గ్రామంలో బస్టాండ్, శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠంలో భవన నిర్మాణాలతో కొంత మేర కళాకారుల అభిమానాలను చూరగున్నారు. 1999 నుండి 2004 వరకు, 2014 నుండి 2019 వరకు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేవలం కళాకారులను సంతృప్తి పర్చేందుకు మాటల గారడీతో ఇదిగో అభివృద్ధి.. అదిగో అభివృద్ధి అంటూ అరచేతిలో వైకుంఠం చూపించారు. కూచిపూడి అభివృద్ధికి 2000 సంవత్సరంలో రూ.3కోట్లు ఇస్తానన్న వాగ్ధానం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అదే సమయంలో కూచిపూడిని పర్యాటక కేంద్రంగా, అంతర్జాతీయ నాట్య కళా కేంద్రంగా అభివృద్ధి చేస్తానని పలు సభలలో చేసిన వాగ్ధానాలు అమలుకు నోచుకోలేదు. తిరిగి 2014 నుండి 2019 వరకు కూచిపూడి కళను, గ్రామాన్ని అభివృద్ధి చేస్తానంటూ వాగ్ధానాలిచ్చి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కూచిపూడి గ్రామాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నాట్యారామ నిర్మాణం పేరుతో రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు కళాకారులు, కళాభిమానుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అది అమలుకు నోచుకోలేదు. పర్యాటక కేంద్రాభివృద్ధిలో భాగంగా స్థానిక వేదాంతం వారి ధర్మ చెరువును అభివృద్ధి చేసేందుకు అదనంగా రూ.5కోట్లు కేటాయిస్తానన్న వాగ్ధానం కేవలం రూ.2కోట్ల నిధులకే పరిమితమైంది. ఆ నిధులతో చెరువు చుట్టూ కాంచిపురం పుష్కరిణి తలపించేలా మెట్లు మాత్రం కట్టి వదిలి వేశారు. కూచిపూడి అభివృద్ధికి ప్రభుత్వం నామమాత్రంగా కూడా నిధులు కేటాయించని నేపథ్యంలో అమెరికాలోని సిలీకానాంధ్ర సంస్థ వ్యవస్థాపకుడు కూచిబొట్ల ఆనంద్ ఈ గ్రామాన్ని స్వచ్ఛ్భారత్ పథకం కింద దత్తత తీసుకుని గ్రామంలోని 80 శాతం అంతర్గత రహదారులను సీసీ రోడ్లుగా అభివృద్ధి చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో నిర్మించిన బస్టాండ్ దుర్వాసన వెదజల్లుతుండటంతో ఆర్టీసీ, సిలీకానాంధ్ర సంయుక్త సహకారంతో అంతర్గత రహదారిని, పార్కును నిర్మించి ప్రయాణీకులకు ఆహ్లాదాన్ని కల్పించారు. కూచిపూడి గ్రామ పంచాయతీ భవనం, జడ్పీ ఉన్నత పాఠశాలను డిజిటల్ గదులుగా ఆనంద్ ప్రభుత్వేతర నిధులతో అభివృద్ధి చేశారు. ఇదే సమయంలో కూచిపూడిలో సిలీకానాంధ్ర నిర్మించిన సంజీవని మల్టి స్పెషాలిటీ వైద్యాలయం అభివృద్ధికి రూ.10కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి వాగ్ధానానికే పరిమితం చేశారు. అయితే నాడు కూచిపూడి అభివృద్ధికి శ్రీకారం చుట్టిన అప్పటి ముఖ్యమంత్రిగా రాజశేఖరరెడ్డి వలే ఆయన కుమారుడైన ప్రస్తుత సీఎం జగన్మోహనరెడ్డి తండ్రి బాటలోనే కూచిపూడి గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా, కళాకేంద్రంగా అభివృద్ధి పర్చాలని కళాకారులు, కళాలోకం, గ్రామస్తులు కోరుతున్నారు.