కృష్ణ

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్): ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి సిహెచ్ సూర్యప్రకాశరావు అన్నారు. పంచాయతీ రాజ్ మినిస్ట్రీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా పరిషత్ యూనిట్ ఆధ్వర్యంలో ఆదివారం జడ్పీ కార్యాలయ ఆవరణలో కార్తీక వన సమారాధన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సూర్యప్రకాశరావు మాట్లాడుతూ కార్తీక మాసం ఎంతో విశిష్టత కలిగిన మాసమన్నారు. ఆధ్యాత్మికంగా, శాస్ర్తియంగా కార్తీక మాసానికి ఎంతో విశిష్ఠత ఉంటుందన్నారు. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా కార్తీక మాసంలో పరమ శివుడిని కొలుస్తామన్నారు. ఈ మాసంలో ప్రతి రోజూ అత్యంత పవిత్రమైనదిగా ప్రజలు విశ్వసిస్తారన్నారు. అటువంటి కార్తీక మాసంలో ఏ కార్యం మొదలు పెట్టినా సఫలీకృతమవుతామన్నారు. మనలోని ఐక్యతను కూడా కార్తీక మాసం ద్వారా ప్రపంచానికి తెలుస్తుందన్నారు. వన సమారాధనల పేరుతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా కలిసి ఆనందంగా గడపటం ఓ మంచి సాంప్రదాయమన్నారు. తొలుత ఉసిరి చెట్టు కింద పరమ శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జడ్పీ కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో కలిసి వన సమారాధన చేశారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ సీఇఓ ఎ నాగమహేశ్వరరావు, ఎఓ కె కృష్ణమోహనరావు, మినిస్ట్రీరియల్ ఎంప్లాయిస్ యూనియన్ జడ్పీ యూనిట్ అధ్యక్షుడు దారపు శ్రీనివాస్, కార్యదర్శి ఎజె జయకర్, తూర్పు కృష్ణా ఎన్జీఓస్ అసోసియేషన్ అధ్యక్షుడు వుల్లి కృష్ణ, అసోసియేషన్ ప్రతినిధులు పివి సాయికుమార్, అసోసియేషన్ ప్రతినిధులు కె రవికాంత్, ఎల్ అలీకాంత్, సిహెచ్ మాలతి, ఎస్ పద్మకుమారి, డి లీలాకృష్ణ, పి మారుతీరావు, పి భాస్కర్, ఆర్ హేమ ప్రకాష్, బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.