కృష్ణ

అదుపు తప్పిన కారు.. ఐదుగురికి తీవ్ర గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు, జూన్ 23: పామర్రు నాలుగు రోడ్ల జంక్షన్‌లో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గురువారం సాయంత్రం అడ్డాడ హైస్కూల్‌లో పనిచేసే వై వసుందరి అనే టీచర్ తన సొంత కారును డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి అదుపుతప్పి రోడ్డు పక్కన వేచి ఉన్న ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కురుమద్దాలికి చెందిన శ్రీలక్ష్మి, లక్ష్మి, అడ్డాడకు చెందిన విజయ, వెంకటేశ్వరమ్మ, బాబూరావు అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన 108లో ఉయ్యూరు, గుడివాడ ఆసుపత్రులకు తరలించారు. పామర్రు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పాముకాటుతో వ్యవసాయ కూలీకి తీవ్ర అస్వస్థత
కూచిపూడి, జూన్ 23: మొవ్వ మండలం పెదపూడి గ్రామంలోని చెరుకు తోటలో పనిచేస్తున్న వ్యవసాయ కూలీ పాముకాటుకు గురై అపస్మారక స్థితికి చేరుకున్న సంఘటన గురువారం జరిగింది. పమిడిముక్కల మండలం మర్రివాడకు చెందిన వ్యవసాయ కూలీలు పెదపూడి చెరుకు తోటలో జడలు కడుతున్నారు. ఈసందర్భంగా వి రాజకమల్ అనే కూలీని గురువారం పాము కాటేసింది. తోటి కూలీలు వెంటనే అతన్ని మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సకాలంలో చికిత్స అందించటంతో రాజకమల్ కోలుకుంటున్నట్లు ఎస్‌ఐ వి సతీష్ వివరించారు.