కృష్ణ

వీఆర్‌ఓ, గ్రేడ్-3 సర్వేయర్లకు నియామక పత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్) : గ్రామ సచివాలయ ఉద్యోగుల రెండవ విడత నియామకాలకు సంబంధించి సోమవారం గ్రేడ్-3 సర్వేయర్లు, వీఆర్‌ఓ అభ్యర్థులకు నియామక పత్రాలను కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అందజేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సచివాలయాలకు సంబంధించి తొలి విడత 554 మందిని గ్రేడ్-3 గ్రామ సర్వేయర్ల నియామకం చేపట్టామన్నారు. రెండవ విడతగా 215 మందిని నియమించినట్లు తెలిపారు. అదే విధంగా వీఆర్‌ఓలకు సంబంధించి మొదటి విడత 128 మందిని, రెండవ విడత 114 మందిని జిల్లాలో నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత, డీఆర్‌ఓ ఎ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
స్పందన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
* కలెక్టర్ ఇంతియాజ్
మచిలీపట్నం (కోనేరుసెంటర్), నవంబర్ 18: స్పందనలో వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రభుత్వ సేవల విషయమై అర్జీదారులలో మరింత నమ్మకాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలతతో కలిసి ఆయన పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన అర్జీల పరిష్కారానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఆ దిశగా పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్ అర్జీలపై మరింత దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ ఎ ప్రసాద్, ఆర్డీవో ఖాజావలి, సివిల్ సప్లైస్ డీఎం రాజ్యలక్ష్మి, డీఆర్‌డీఎ పీడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.