కృష్ణ

‘స్పందన’ అర్జీలు వెంటనే పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు: స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను నిర్ణీత సమయంలో సంబంధిత అధికారులు పరిష్కరించాలని నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌కు వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్పందన కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నిర్ణీత సమయంలోపే పరిష్కరించాలని ఆదేశించారు. అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నూజివీడు పురపాలక సంఘం పరిధిలో ప్రజల అవసరం మేరకు మంచినీరు సరఫరా కావటం లేదని, ఈ విషయంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎండి అలీ అబ్బాస్ వినతిపత్రాన్ని అందజేశారు. పురపాలక సంఘం పరిధిలోని ప్రధాన రహదారుల్లో మూగ జీవాలు సంచరిస్తున్నాయని, దీంతో ట్రాఫిక్‌కు అవరోధం కలుగుతుందని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అపస్మారక స్థితిలో ఉన్న మహిళను కాపాడిన హోంగార్డులు

పెనుగంచిప్రోలు, నవంబర్ 18: పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయం వద్ద అపస్మారక స్థితిలో ఉన్న మహిళను డ్యూటీలో ఉన్న హోంగార్డు కాపాడి మానవత్వాన్ని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే తిరుపతమ్మ అమ్మవారి ఆలయం వద్ద సోమవారం తెల్లవారుజామున అపస్మారక స్థితిలో ఉన్న మహిళను డ్యూటీలో ఉన్న హోంగార్డులు గుర్తించారు. ఆమె వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా ఆమె వళ్లంతా గాయాలతో నీరసంగా ఉండి ఏమి చెప్పలేకపోయింది, దీంతో హోంగార్డులు ఆమెకు అల్పాహారం, భోజన సదుపాయం కల్పించారు. సాయంత్రం 7గంటల సమయంలో తిరిగి ఆమెను వివరాలు అడగ్గా కొద్దిగా కోలుకున్న ఆమె తనది ప్రకాశం జిల్లా కురిచేడు మండలం అగ్రహారం గ్రామం అని, తన పేరు నారబోయిన నాగేంద్రం అని భర్త పేరు నాగేశ్వరరావు అని చెప్పింది. గత కొద్ది రోజులుగా భార్య భర్తల మధ్య గొడవలు ఉండటంతో ఆదివారం సాయంత్రం తన భర్త తీవ్రంగా కొట్టి ఆటోలో ఎక్కించుకొని వచ్చి గుడి వద్ద పడేసి వెళ్లిపోయాడని తెలిపింది. తన భర్త తనను చంపడానికి కూడా ప్రయత్నించాడని తెలిపింది. దీనిపై వెంటనే హోంగార్డులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు, ప్రకాశం జిల్లా కురిచేడు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించగా వారు అగ్రహారం గ్రామంలోని ఆమె సోదరుడు తాటి ఎర్రన్న, తండ్రి తాటి చెంచయ్యకు సమాచారం అందించారు. అలాగే తీవ్ర గాయాలతో ఉన్న నాగేంద్రమ్మను 108 అంబులెన్స్ ద్వారా జగ్గయ్యపేట ఆసుపత్రికి తరలించారు. దీనిపై అపస్మారక స్థితిలో ఉన్న మహిళను కాపాడిన హోంగార్డులు ముండ్లపాటి అప్పారావు, పరమయ్య, ఘంటా మధు, నాగరాజు, నూరద్దీన్‌లను దేవస్థానం సిబ్బందితో పాటు పలువురు భక్తులు అభినందించారు.

సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి
* వన సమారాధనలో కలెక్టర్ ఇంతియాజ్

మచిలీపట్నం, నవంబర్ 18: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అన్నారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని స్థానిక కలెక్టర్ బంగ్లాలో కార్తీక వన సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత, జాయింట్ కలెక్టర్-2 మోహన్ కుమార్, డీఆర్‌ఓ ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల అధిపతులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. తొలుత పరమశివులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రతి ఉద్యోగి సేవాభావంతో పని చేసిన నాడే ప్రజల మన్ననలు పొందగలమన్నారు. ప్రజలు అనేక సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వ ఉద్యోగులను కలిసినప్పుడు వారితో ప్రేమగా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఉద్యోగులు విధి నిర్వహణలో అనేక ఒత్తిడులతో ఉంటారని, ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా అందరూ కలిసి వేడుకలా కార్తీక సమారాధన జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఖాజావలి, డీఆర్‌డీఎ పీడీ శ్రీనివాసరావు, సివిల్ సప్లైస్ డీఎం రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.