కృష్ణ

ప్రతి ఇంటికీ ప్రభుత్వ సేవలే లక్ష్యంగా ‘వైఎస్‌ఆర్ నవశకం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ప్రతి ఇంటి గడప వద్దకే పాలన అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్‌ఆర్ నవశకం ప్రవేశ పెట్టిందని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అన్నారు. నవశకం నియమావళిని ఖచ్చితంగా అమలు చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నవశకం అమలుపై ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు, పురపాలక సంఘ కమిషనర్లకు ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ వైఎస్‌ఆర్ నవశకాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ఐదు రకాలైన కార్డుల జారీ, ఏడు పథకాల అమలు నవశకం ముఖ్య ఉద్దేశమన్నారు. రేషన్, పెన్షన్, ఆరోగ్యశ్రీ, జగనన్న విద్యా సేవ, జగనన్న వసతి సేవలకు వేరేవేరు ప్రత్యేక కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇందు కోసం ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. ఒకొక్క కార్డు పొందడానికి లబ్ధిదారుల అర్హతలు వేర్వేరుగా నియమావళి ఇచ్చారని, వాటిని క్షుణ్ణంగా అర్థం చేసుకుని అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ నెల 20వతేదీ నుండి 30వ తేదీ వరకు గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటి తలుపు తట్టి వారి అర్హతల మేరకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూస్తారన్నారు. పేదరికం అర్హతగా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. క్షేత్ర స్థాయిలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి సిబ్బందిని సంపూర్ణంగా నియమించడం ద్వారా పథకాలు ఎంతో పారదర్శకంగా అమలు చేయవచ్చన్నారు. గతంలో మాదిరిగా అధికారులు సిబ్బంది కొరత వంటి సాకులు చెప్పే పరిస్థితి నేడు లేదన్నారు. జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత మాట్లాడుతూ ఈ నెల 20వతేదీ నుండి వైఎస్‌ఆర్ నవశకం సర్వే మొదలు కానుందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాల్లో వైఎస్‌ఆర్ నవశకం ఒకటన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఇఓ సూర్యప్రకాశరావు, అసిస్టెంట్ కలెక్టర్ అంజలీ అనుపమ, జేసీ-2 మోహన్ కుమార్, డీఇఓ ఎంవి రాజ్యలక్ష్మి, డీపీఓ డా. జె అరుణ, డీఆర్‌డీఎ పీడీ ఎం శ్రీనివాసరావు, మెప్మా పీడీ జివి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.