కృష్ణ

ఆపరేషన్ ముస్కాన్‌లో 95 మందికి విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నూజివీడు సబ్ డివిజన్ పరిధిలో నిర్వహించి ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో 95 మంది బాల బాలికలకు విముక్తి కలిగించినట్లు నూజివీడు డీఎస్పీ బి శ్రీనివాసులు వెల్లడించారు. బుధవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేఖర్లతో మాట్లాడుతూ పలకా, బలపం చేతపట్టి బడికి వెళ్ళాల్సిన సమయంలో అనేక మంది చిన్న పిల్లలు వివిధ రంగాలలో బాల కార్మికులుగా వెట్టి చాకిరీ చేస్తున్నారని ఆయన వివరించారు. గత రెండురోజులుగా నూజివీడు సబ్ డివిజన్ పరిధిలోని తమ సిబ్బందిని ఆపరేషన్ ముస్కాన్ పేరుతో వివిధ కర్మాగారాలలో దాడులు నిర్వహించగా డివిజన్ పరిధిలో 95 మందిని పట్టుకున్నట్లు తెలిపారు. మైలవరం సర్కిల్ పరిధిలో 39 మందిని పట్టుకున్నామన్నారు. ఇందులో 29 మంది మగ పిల్లలుండగా 10 మంది ఆడపిల్లలున్నట్లు తెలిపారు. వీరిని వారివారి తల్లిదండ్రులకు అప్పగించటంతోపాటు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారి ద్వారా వారికి అందుబాటులో ఉన్న ప్రాంతాలలోని ఆయా పాఠశాలలలో చేర్పించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో మైలవరం సీఐ పి శ్రీను, ఎస్‌ఐలు ఈశ్వరరావు, రాంబాబు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

క్రీడలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం
మచిలీపట్నం (కల్చరల్), నవంబర్ 20: కృష్ణా విశ్వ విద్యాలయం క్రీడా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఉపకులపతి ఆచార్య వైకె సుందరకృష్ణ తెలిపారు. కృష్ణా విశ్వ విద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల ఫుట్‌బాల్ పోటీలు బుధవారం స్థానిక ఆంధ్ర జాతీయ కళాశాల క్రీడా మైదానంలో ప్రారంభమయ్యాయి. పోటీలను ప్రారంభించిన ఉపకులపతి సుందర కృష్ణ మాట్లాడుతూ క్రీడాకారులకుతమవంతు ప్రోత్సాహం అందించాలన్న ఉద్దేశ్యంతో విశ్వ విద్యాలయం విద్యార్థులకు ప్రతిభా మార్కులు కూడా కేటాయిస్తున్నట్టు తెలిపారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో క్రీడాకారులు ప్రతిభ కనబర్చి పటిష్ఠమైన జిల్లా జట్టును ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి శ్రీనివాసరావు, వర్సిటీ అధ్యాపకులు కిరణ్ కుమార్, రామశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.