కృష్ణ

త్వరలో దళితవాడలకు మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి: రాష్ట్ర ముఖ్యమంత్రి దళితుల అభివృద్ధికి ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టి అమలుపరుస్తున్నారని, త్వరలో దళితవాడల రూపు రేఖలే మారనున్నాయని పామర్రు శాసనసభ్యుడు కైలే అనిల్ కుమార్ పేర్కొన్నారు. మొవ్వ మండలం పెదముత్తేవి గ్రామంలోని దళితవాడలో గురువారం నిర్వహించిన కుంతీదేవి పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాజులపాటి రాఘవరావు, మాజీ అధ్యక్షుడు చిందా వీర వెంకట నాగేశ్వరరాజు, మురళీ, శేషుబాబు, గోగినేని పెరుమాళ్లు, కాకర్ల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
* డీఎస్పీ సత్యానందం
పామర్రు, నవంబర్ 21: డివిజన్ పరిధిలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు గుడివాడ డీఎస్పీ ఎన్ సత్యానందం పేర్కొన్నారు. పామర్రు పోలీసు స్టేషన్ రికార్డులను వార్షిక తనిఖీ నిమిత్తం గురువారం విచ్చేసిన ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం ప్రజల సహకారం అవసరం అన్నారు. ప్రతి ముఖ్యమైన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. అసాంఘిక వ్యక్తులు పట్ల నిఘా పెంచామన్నారు. పామర్రు స్టేషన్ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డులను పామర్రు సీఐ ఎం కిషోర్‌బాబు, ఎస్‌ఐ ఎ గణేష్ కుమార్, మహిళ ఎస్‌ఐ ఆర్ కృష్ణకుమారి డీఎస్పీ సత్యానందంకు వివరాలు అందజేశారు.