కృష్ణ

కన్నుల పండువగా మోపిదేవి స్వామి దివ్య కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి: మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వార్షిక మార్గశిర షష్టి మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన సోమవారం స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల అసిస్టెంట్ కమిషనర్ లీలాకుమార్ పర్యవేక్షణలో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. 330 మంది దంపతులు స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొనగా వేద పండితులు నౌడూరి విశ్వనాధ సుబ్రహ్మణ్య శర్మ బ్రహ్మత్వంలో వేద మంత్రోచ్చరణల మధ్య మేళతాళాలతో కల్యాణం నిర్వహించారు. మాంగళ్యధారణ ఘట్టాన్ని ఆలయ ప్రధాన అర్చకుడు బద్దు పవన్ కుమార్ శర్మ నిర్వహించగా తలంబ్రాలు ఘట్టాన్ని కొమ్మూరు ఫణిశర్మ నిర్వహించారు. సాయంత్రం మయూర వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ కార్యక్రమాల్లో భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. అవనిగడ్డ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో అవనిగడ్డ, మోపిదేవి ఎస్‌ఐలు సందీప్, సురేష్‌లు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఎస్టేట్ ఆలయాల సూపరింటెండెంట్లు మధుసూదనరావు, చెన్నకేశవ, ప్రసాద్, రామకృష్ణ, అధికారులు మల్లేశ్వరరావు, మురళి తదితరులు పాల్గొన్నారు.