కృష్ణ

నవశకం సర్వేపై గంట గంటకూ సీఎంఓ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల్లో ఒకటైన వైఎస్‌ఆర్ నవశకం’ సర్వేపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కార్యాలయం ప్రతి గంటకూ ప్రగతిని సమీక్షిస్తుందని కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నవశకం అమలులో భాగంగా వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రత్యేక కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుండి జిల్లాలోని ఆర్డీవోలు, సబ్ కలెక్టర్లు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బియ్యం కార్డు, ఆరోగ్యశ్రీ, పెన్షన్ కార్డుల జారీలో ఆగిరిపల్లి, విజయవాడ రూరల్, గన్నవరం, జి.కొండూరు, కోడూరు, తోట్లవల్లూరు మండలాలు 95 శాతం పైగా ప్రగతి సాధించాయన్నారు. విజయవాడ నగరంతో పాటు పెనమలూరు, మండవల్లి, కంకిపాడు తదితర మండలాలు ప్రగతిలో వెనుకబడ్డాయన్నారు. డివిజన్‌ల వారీగా కార్డుల జారీ ప్రగతిని కలెక్టర్ సమీక్షించారు. విజయవాడ డివిజన్‌లో 70 శాతం, గుడివాడ డివిజన్‌లో 64 శాతం పెండింగ్ ఉన్నాయన్నారు. ముఖ్యంగా విజయవాడ డివిజన్‌లో ప్రగతి సాధించాలని అధికారులకు సూచించారు. ఉగాది నాటికి పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలతో పాటు గుర్తించిన పట్టా భూముల వివరాలు వాటి సేకరణకు అయ్యే వ్యయం అంచన వివరాలు వెంటనే అందజేయాలన్నారు. ఫిబ్రవరిలోగా గుర్తించిన పట్టా భూముల సేకరణ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీఆర్‌డీఎ గ్రామాల్లో ఇళ్ల స్థలాల అర్హుల జాబితాతో పాటు భూమి వివరాలతో సహా సంబంధిత గృహ నిర్మాణ శాఖాధికారులకు అందజేయాలని, గృహ నిర్మాణ అధికారులు డీపీఆర్ సిద్ధం చేయాలన్నారు. సామాజిక ధృక్పథంతో ఎయిడ్స్ బాధితులకు సాయం అందించాలన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా ఆదివారం వివిధ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత మాట్లాడుతూ బియ్యం, ఆరోగ్యశ్రీ, పెన్షన్ కార్డుల జారీకి అర్హతలు, నిబంధనలు పాటించి లబ్ధిదారుల జాబితాలు తయారు చేయాలని, ఈ విషయంలో రెవెన్యూ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాధవీలత, జేసీ-2 మోహన్ కుమార్, డీఆర్‌ఓ ప్రసాద్, ఆర్డీవో ఖాజావలి, జడ్పీ సీఇఓ సూర్యప్రకాశరావు, డ్వామా పీడీ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.