కృష్ణ

రైతు గుండెల్లో గుబులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు: ఉపరితల ద్రోణి రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. సోమవారం వాతావరణంలో మార్పువచ్చి కారుమబ్బులు కమ్ముకోవటంతో రైతన్నలు పొలాలకు పరుగులు పెట్టారు. కోత కోసి ఉన్న పనలను, పంటను కాపాడుకునేందుకు కూలీలతో కుప్పలు వేయించే పనుల్లో నిమగ్నమయ్యారు. అప్పటి కప్పుడు కూలీలను మాట్లాడుకుని వరి కోత కోసిన పనలను కట్లు కట్టించి కుప్పలు వేయించుకున్నారు. ఇప్పటికే వేసిన వరి కుప్పలపై ప్లాస్టిక్ పట్టాలు కప్పుకుని భద్రపరుచుకుంటున్నారు. మరోవైపు కోతకు వచ్చిన వరి పంటను ఆధునిక యంత్రాలతో కోత కోయించగా వచ్చిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు చేరవేసుకునే పనుల్లో మరికొందరు రైతులు నిమగ్నమయ్యారు. మరి కొంత మంది రైతులు కోసిన వరి ధాన్యాంపై పరదాలు కప్పుతున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉండటంతో కల్లాల్లో అరబోసిన ధాన్యాన్ని బస్తాలలో నింపి ఇళ్లకు చేర్చుకుంటున్నారు. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిస్తే నిలువు మీద ఉన్న వరిపైరుతో పాటు కోత కోసిన వరి పనలు, వరి కుప్పలు, ఆరబోసిన ధాన్యం వర్షాలకు తడిసి ఎక్కడ దెబ్బతింటుందోనని మనోవేదన చెందుతున్నారు. ఈ గండం గట్టెక్కాలని అన్నదాతలు దేవున్ని ప్రార్థించుకుంటున్నారు.

మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి
అవనిగడ్డ, డిసెంబర్ 2: హైదరాబాద్‌లో దిశ పై అత్యాచారం హత్య చేసిన మానవ మృగాలకు విధించే శిక్ష సమాజంలో అటువంటి ఆలోచన చేసే వారికి భయం కలిగించాలని, ప్రతి మానవమృగంపై ప్రభావం చూపేలా ఉండాలని పలు విద్యాసంస్థల ప్రతినిధులు అన్నారు. సోమవారం స్థానికంగా ఉన్న పలు పాఠశాలలు, కళాశాలలకు చెందిన ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థల ఆధ్వర్యంలో అవనిగడ్డ ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజీవ్ గాంధీ చౌక్‌లో విద్యార్థులు మానవహారం నిర్మించగా ఎస్‌వీఎల్ క్రాంతి కళాశాల, ప్రగతి విద్యా సంస్థలు, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఎన్‌ఆర్‌ఐ పాఠశాల, మండలి వెంకట కృష్ణారావు డిఎడ్ కళాశాలకు చెందిన విద్యార్థులు, నవజీవన్ విద్యా సంస్థలు ర్యాలీ, మానవహారంలో పాల్గొనాయి. ఈ కార్యక్రమంలో ప్రగతి పూర్ణచంద్రరావు, భోగాది సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, ఈశ్వరరావు, విష్ణుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వోద్యోగుల్లో అవినీతిని సహించేది లేదు
* వెటర్నరీ జేడీపై సర్జన్ల ఫిర్యాదు సందర్భంగా మంత్రి కొడాలి నాని
గుడివాడ, డిసెంబర్ 2: ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతిని సహించేది లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. సోమవారం స్థానిక మంత్రి కొడాలి నానిని కృష్ణా జిల్లా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ కె. భరత్ రమేష్‌పై ఫిర్యాదు చేశారు. పథకాల అమలులో అవినీతి తారస్థాయికి చేరిందని, పాలనా వ్యవహారాలు సరిగా లేవని అన్నారు. జేడీపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మంత్రి నాని మాట్లాడుతూ జగన్ పాలనలో అవినీతికి ఆస్కారం లేదన్నారు. అవినీతి అధికారులపై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిందన్నారు. ఏ ప్రభుత్వ శాఖలోనైనా అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడినట్టు తేలితే కఠిన చర్యలు తప్పవని మంత్రి నాని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ కే జయకాంత్, డాక్టర్ కే మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఉయ్యూరుకు చెందిన మైనార్టీ మహిళ పరిహద్ కౌషద్ మంత్రి నానిని కలిసి 2వ విడత వలంటీర్ల పోస్టుల భర్తీలో తనకు అవకాశం కల్పించాలని వేడుకుంది. దీనిపై మంత్రి నాని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన పేదలందరికీ అందించేందుకు సీఎం జగన్మోహనరెడ్డి వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరినీ వలంటీర్ పోస్టులకు ఎంపిక చేస్తామని మంత్రి కొడాలి నాని తెలిపారు.