కృష్ణ

‘దిశ’ హత్యోదంతంపై స్పందించిన కలెక్టరేట్ ఉద్యోగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంచలనం సృష్టించిన పశు వైద్యురాలు డా. దిశ హత్యోదంతంపై ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు కూడా స్పందించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది బుధవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రాంగణంలోని తెలుగు తల్లి విగ్రహం సాక్షిగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మానవ మృగాల చేతిలో కిరాతకంగా హత్య కాబడిన డా. దిశ ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అలాగే నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునే విధంగా ఉన్నాయని డీఆర్‌ఓ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత పాశవికంగా డా. దిశపై అత్యాచారం జరిపి పెట్రోలు పోసి తగలబెట్టి హతమర్చడాన్ని చూస్తుంటే మానవ సంబంధాలు ఏ విధంగా ఉంటున్నాయో అర్థమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ వెనె్నల శ్రీనివాస్, ఏపీ జేఎసీ ప్రధాన కార్యదర్శి విక్టర్ బాబు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు నెల్సన్ పాల్, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షుడు శ్యామ్, కార్యదర్శి శ్రీనివాసరావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు ప్రసాదరావు, అశయ్య, ఎల్లారావు, సుభాష్, విజయలక్ష్మి, వీరాంజనేయ ప్రసాద్, మల్లిఖార్జునరావు, బేగ్ తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
* జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు
మచిలీపట్నం (కల్చరల్), డిసెంబర్ 4: వైకల్యం అనేది శరీరానికే గానీ మనస్సుకు కాదని, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే సాధించని విజయమంటూ ఏమీ ఉండదని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం స్థానిక నవీన్ మిట్టల్ కాలనీలోని దివ్య చారిటబుల్ ట్రస్టు కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పని చేస్తున్న సీఐ జనార్థనరావు, ఆర్‌ఐ శ్రీనివాస గౌడ్, ఎస్‌ఐలు నాగరాజు, చంద్రశేఖర్‌లు సమకూర్చిన రూ.30వేలు విలువ చేసే వివిధ రకాల ఫిజియో థెరపి పరికరాలను ఎస్పీ రవీంద్రనాథ్ బాబు చేతుల మీదుగా ట్రస్టు నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ట్రస్టు చేస్తున్న సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు చైర్‌పర్సన్ ఉమారాణి, మేనేజింగ్ డైరెక్టర్ ధర్మరాజు, ఫిజియో థెరపి డా. సౌజన్య తదితరులు పాల్గొన్నారు.