కృష్ణ

చార్జీల పెంపు తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంకిపాడు: రాష్ట్ర ప్రభుత్వం బస్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి షేక్ చిన్నా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిత్యావసర సరుకులు, ఉల్లి ధరలు పెరిగి ఇప్పటికే పేదలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమయంలో ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచటం పెనుభారంగా మారుతుందని మంగళవారం ఆయన ఇక్కడ ఆవేదన వ్యక్తం చేశారు.

టెక్నోథ్లాన్ పరీక్షలను
సద్వినియోగం చేసుకోండి
కంకిపాడు, డిసెంబర్ 10: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నంలో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే టెక్నోథ్లాన్ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు, ఐఐటీ గౌహతి విద్యార్థులు భార్గవ్, సంపత్, నిఖిత, ఖాశ్విత తెలిపారు. మంగళవారం వారిక్కడ విలేఖరులతో మాట్లాడుతూ 2020 జూలై 19న దేశ వ్యాప్తంగా 600లకు పైగా కేంద్రాల్లో టెక్నోథ్లాన్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రిలిమ్స్, మెయిన్స్ దశల్లో పరీక్ష ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌లో ఇచ్చే ప్రశ్నలు విద్యార్థుల మానసిక సామర్థ్యాన్ని పరీక్షించేలా ఉంటాయన్నారు. 2020లో 9, 10 తరగతులు చదివే విద్యార్థులు, జూనియర్ ఇంటర్ విద్యార్థులకు విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రిలిమ్స్‌లో ప్రతిభ కనబరిచిన మొదటి 50 జట్లను 2020 ఆగస్టు 27నుంచి 30వరకు ఐఐటీ గౌహతిలో నిర్వహించే ప్రతిష్టాత్మక సాంకేతిక ఉత్సవం టెక్నీష్‌కు ఆహ్వానిస్తామన్నారు. గతంలో నిర్వహించిన టెక్నోథ్లాన్ పరీక్షలో మెదటి స్థానం సాధించిన జట్టును అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు, ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టును ఇస్రో సందర్శనకు తీసుకెళ్లినట్లు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచిన మొదటి 250 జట్లకు గోల్డ్, సిల్వర్ మెడల్స్‌తో పాటు సర్ట్ఫికెట్లు, నగర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన జట్లను కూడా ఐఐటీ గౌహతికి ఆహ్వానిస్తారని వారు వివరించారు.