కృష్ణ

దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు): దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. బుధవారం మంత్రి పేర్ని నాని కార్యాలయానికి ప్రజలు వచ్చి తమ సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు. స్థానిక వైఎస్‌ఆర్ కాలనీకి చెందిన దివ్యాంగుడు రెంటాల వీరాస్వామి తన మూడు చక్రాల సైకిల్‌కు మోటార్ ఏర్పాటు చేయాలని కోరాడు. స్పందించిన మంత్రి ప్రభుత్వం మోటార్ ఏర్పాటుకు కృషి చేస్తుందన్నారు. దివ్యాంగులకు సంపూర్ణంగా అనువైన, అవసరమైన పరికరాలు అందజేయడంతో పాటు వివిధ పథకాల కింద ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకుని ఆత్మస్థైర్యంతో వృద్ధి చెందాలన్నారు. రెవెన్యూ శాఖలో వాచ్ అండ్ వార్డు క్లీనింగ్ చేస్తున్న సిబ్బంది గోపి, విజయ్ తదితరులు మంత్రితో జీతాలు సక్రమంగా అందడం లేదని, కుటుంబ పోషణ కూడా కష్టంగా ఉందని మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ఏపీసీఓఎస్ తమను కూడా నమోదు చేయాలని, జీతాలు కూడా సక్రమంగా అందేలా చూడాలన్నారు. స్థానిక గోపాల్ నగర్‌కు చెందిన వృద్ధురాలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నానని తెలుపగా సొంత ఖర్చులతో కాకినాడ ఆసుపత్రికి పంపించమని తన సిబ్బందిని పురమాయించారు.

ఆర్టీసీ చార్జీల పెంపు గర్హనీయం
మచిలీపట్నం(కోనేరుసెంటర్), డిసెంబర్ 11: ఆర్టీసీ చార్జీల పెంపు ప్రభుత్వ చిత్తశుద్ధిని సంకిస్తోందని వామపక్ష నేతలు విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం నష్టాల బూచిని చూపుతూ చార్జీలు పెంచి ఆ భారాన్ని సామాన్య, మధ్య తరగతి ప్రజలపై వేయడం సరైన విధానం కాదన్నారు. ఆర్టీసీ చార్జీలు, ఉల్లి కొరతపై వామపక్ష పార్టీలైన సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కోనేరుసెంటరులో ధర్నా నిర్వహించి ప్రభుత్వ విధానాలను ఎంగట్టారు. ఆర్టీసీ చార్జీలను తక్షణం తగ్గించుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఉల్లి కొరతపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. సబ్సిడీపై రూ.25లకు రైతుబజార్ల ద్వారా ఉల్లిపాయలు సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా డిమాండ్ మేరకు సరఫరా చేయడం లేదన్నారు. ఫలితంగా రైతు బజార్ల వద్ద వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు కొడాలి శర్మ, చౌటపల్లి రవి, బూర సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వరరావు, కొల్లాటి శ్రీను, జన్ను జగన్, ఎర్రంశెట్టి ఈశ్వరరావు, సిహెచ్ రాజేష్, టి చంద్రపాల్, పి లక్ష్మి, ముచ్చు సుధాకర్, లింగం ఫిలిప్, కర్నాటి అర్జునరావు, మోదుమూడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.