కృష్ణ

ప్రతిభ గల విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్): ప్రతిభ గల పేద విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించాలని కృష్ణా విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య వైకె సుందరకృష్ణ అన్నారు. గురువారం విశ్వ విద్యాలయంలో 44 మంది ప్రతిభ గల పేద విద్యార్థులకు రూ.2500లు చొప్పున రూ.లక్షా 10వేలు ఉపకార వేతనాలుగా అందజేశారు. శిష్ట్లా రామ్మోహన్ జ్ఞాపకార్థం ఎస్‌ఎ నాగమణి విశ్వ విద్యాలయానికి రూ.10లక్షలు విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని ఫిక్సిడ్ డిపాజిట్‌గా బ్యాంక్‌లో పొదుపు చేసి దానిపై వచ్చే వడ్డిని ఉపకార వేతనాలుగా ఇస్తున్నట్టు తెలిపారు. విశ్వ విద్యాలయం రిజిష్ట్రార్ ఆచార్య కె కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యాంపస్ కళాశాల విద్యార్థులు 21 మంది, పీజీ సెంటర్ విద్యార్థులు 19 మంది, ఇంజనీరింగ్ విద్యార్థులు నలుగురు ఉపకార వేతనాలు అందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిజం సహాచార్యులు డా. సిఎం వినయ్ కుమార్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కె కిరణ్ కుమార్, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డా. ఎం బాబురెడ్డి, సహాచార్యులు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.