కృష్ణ

ప్రతి అంశంలోనూ పోటీతత్వంతో ముందుకెళ్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ: ప్రతి అంశంలోనూ విద్యార్థులు పోటీతత్వంతో ముందుకు సాగాలని ఇంటర్మీడియట్ బోర్డు రీజనల్ ఆఫీసర్ (ఆర్‌ఐఓ) పి రవికుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో అంతర్ జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలను ప్రారంభించిన ఆర్‌ఐఓ మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడలతో శారీరక దారుఢ్యం పొందటంతో పాటు ఉద్యోగావకాశాలు కూడా పొందవచ్చన్నారు. తొలి రోజు నిర్వహించిన పోటీల్లో విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. చదరంగం పోటీల్లో విజయవాడ కెబిఎన్ కళాశాల జట్టు ప్రథమ, మైలవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి. బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో కలిదిండి ఎఎస్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల జట్టు, అవనిగడ్డ ఎస్‌విఎల్ క్రాంతి జూనియర్ కళాశాల జట్టు, త్రోబాల్ పోటీల్లో అవనిగడ్డ ఎస్‌వీఎల్ క్రాంతి జూనియర్ కళాశాల జట్టు, మచిలీపట్నం వీఆర్ జూనియర్ కళాశాల జట్టు ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించాయి.