కృష్ణ

‘గొల్లపూడి’ మృతితో బహుముఖ ప్రజ్ఞాశాలిని కోల్పోయాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ: ప్రముఖ సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు మృతితో తెలుగు జాతి ఓ బహుముఖ ప్రజ్ఞాశాలిని కోల్పోయిందని రాష్ట్ర శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. గొల్లపూడి మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు గురువారం ఒక ప్రకటన ద్వారా సానుభూతి తెలియజేశారు. గొల్లపూడితో తనకున్న సన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. గొల్లపూడితో ఎన్నో మధురమైన క్షణాలు గడిపానన్నారు. గొల్లపూడి మారుతీరావు ఆత్మకు శాంతి కలగాని భగవంతున్ని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
‘గొల్లపూడి’ మృతికి సంతాపం
నాగాయలంక: ప్రముఖ సినీ నటుడు, కథా రచయిత గొల్లపూడి మారుతిరావు మృతి పట్ల గురువారం పలువురు కళాభిమానులు, సాహితీవేత్తలు సంతాపం తెలియజేశారు. అభ్యుదయ వేదిక అధ్యక్షుడు తలశిల నాగేశ్వరరావు, కార్యదర్శి వర్రె రాంబాబు మాట్లాడుతూ రానున్న సంవత్సరం తమ సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న ఉగాది పురస్కారాల కార్యక్రమాలకు తాను హాజరవుతానని ఇచ్చిన గొల్లపూడి మృతి చెందడం విచారకరమన్నారు. తెలుగు చిత్రసీమలో నటుడిగా, రచయితగా గొల్లపూడి చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ప్రముఖ సినీ సహాయ దర్శకుడు తలశిల లలిత కుమార్ మాట్లాడుతూ గొల్లపూడితో కలిసి తాను కొన్ని చలన చిత్రాలలో పని చేశామని, ఆయన మరణం జీర్ణించుకోలేనిదన్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సింహ చలనచిత్రానికి తాను కో-డైరెక్టర్‌గా చేసిన సమయంలో గొల్లపూడి తనను ఆశీర్వదించారన్నారు. మారుతిరావు మృతి తెలుగు చలనచిత్ర రంగానికే గాక సాహితీ లోకానికి తీరని లోటని లలిత కుమార్ వ్యాఖ్యానించారు.

ఉపాధ్యాయులు సృజనాత్మకత పెంపొందించుకోవాలి - డీవైఇఓ సత్యనారాయణమూర్తి
మచిలీపట్నం (కల్చరల్), డిసెంబర్ 12: ఉపాధ్యాయులు సృజనాత్మకతను పెంపొందించుకోవాలని బందరు డివిజన్ ఉప విద్యాశాఖాధికారి బత్తిన సత్యనారాయణమూర్తి అన్నారు. గురువారం స్థానిక హైనీ హైస్కూలులో జిల్లా స్థాయి భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కార్యశాల నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ బోధనోపకరణములను తయారీకి సృజనాత్మకత దోహదం చేస్తుందన్నారు. ఎస్ కోదండ పాణి (చిత్తూరు), టి మోహన్ బాబు (చిత్తూరు), జి మోహన నాయుడు రిసోర్స్ పర్సన్స్‌గా వ్యవహరించారు. కో-ఆర్డినేటర్స్‌గా జెటికె ప్రసాద్, బి సోమేశ్వరరావు, ఐడి శ్రీనివాస్, డి వెంకటేశ్వరరావు వ్యవహరించారు.

పైడమ్మ సంబరాల్లో శిడి బండ్ల సందడి
పెడన, డిసెంబర్ 12: స్థానిక పైడమ్మ అమ్మవారి సంబరాలు గురువారం నాటికి 2వ రోజుకు చేరాయి. సంబరాల్లో భాగంగా పట్టణంలో ఘనంగా శిడి బండ్ల ఊరేగింపులు నిర్వహించారు. శిడి బండ్ల ఊరేగింపులో చోటు చేసుకున్న వివిధ కళారూపాలు ఆకట్టుకున్నాయి. ఆలయ ఇఓ జోగి రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. 5, 7, 9, 11 రోజుల్లో జరగనున్న సంబరాలకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నట్టు రాంబాబు తెలిపారు.

లంక భూముల రైతులకు భరోసా ఇవ్వాలి
* సీపీఎం నేత రఘు
చల్లపల్లి, డిసెంబర్ 12: ఎన్నో యేళ్లుగా లంక భూములను సాగు చేసుకుంటున్న రైతులకు రైతు భరోసా వర్తింప చేయాలని సీపీఎం తూర్పు కృష్ణా కార్యదర్శి ఆర్ రఘు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని పురిటిగడ్డ శివారు నిమ్మగడ్డ పరిధిలో నదీగర్భంలో ఉండే సీతపీడలంకలో బుధవారం ఆయన పర్యటించారు. లంక భూములు సాగు చేసుకుంటున్న రైతులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లీజు రెన్యువల్ కాలేదని, ప్రభుత్వ పథకాలు అందటం లేదని, వరదల్లో నష్టపోయినా పరిహారాలు అందటం లేదని వారు తెలిపారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ లంక భూములు సాగు చేసుకుంటున్న రైతులకు లీజు రెన్యువల్ చేయాలన్నారు. రైతు భరోసా వర్తింప చేయటంతో పాటు వరదల్లో నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి యద్దనపూడి మధు, అన్నం గగారిన్ తదితరులు పాల్గొన్నారు.